Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దిల్ రాజ్ ను భయపెడుతున్న పవన్ హస్తిన రాజకీయాలు !

దిల్ రాజ్ ను భయపెడుతున్న పవన్ హస్తిన రాజకీయాలు !

పవన్ కళ్యాణ్ మూడ్ ను తట్టుకుని సినిమా తీయడం ఎంత కష్టమో మరొకసారి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం 'వకీల్ సాబ్' క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరణలో పవన్ తన నట విశ్వరూపాన్ని చూపెడుతున్నాడు అని వార్తలు వచ్చి 24 గంటలు గడవకుండానే 'వకీల్ సాబ్' షూటింగ్ కు మళ్ళీ బ్రేక్ పడింది అని తెలుస్తోంది.



స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాబోతున్న పరిస్థితులలో పవన్ తన అన్ని కార్యక్రమాలు రద్దుచేసుకుని హుటాహుటిన ఢిల్లీ వెళ్ళడం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కీలక నాయకులను కలిసి ఈనెలలో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన భారతీయ జనతా పార్టీలు కలిసి పోటీ చేసే విషయమై లోతుగా చర్చించేందుకు పవన్ ఢిల్లీ వెళ్ళినట్లు టాక్.

పవన్ స్కెచ్ ప్రకారం భారతీయ జనతా పార్టీ జనసేన ల మధ్య ఎన్నికల అవగాహన కుదిరి కలిసి పోటీకి దిగితే ఇప్పుడు ఎండలను కూడ లెక్క చేయకుండా ఈ నెలాఖరు వరకు పవన్ ఈ ఎన్నికల ప్రచారం కోసం జనం మధ్య ఉండవలసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే ప్రస్తుతం పవన్ వేగంగా నటిస్తున్న 'వకీల్ సాబ్' షూటింగ్ కు మళ్ళీ బ్రేక్ పడే ఆస్కారం కనిపిస్తోంది.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో పవన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇంకా చాల పెండింగ్ ఉన్నట్లు టాక్. ఇలాంటి పరిస్థితులలో పవన్ ఏకంగా ఒక నెల 'వకీల్ సాబ్' కు బ్రేక్ ఇస్తే ఈ మూవీ అనుకున్న విధంగా మే నెలలో సమ్మర్ రేస్ ను టార్గెట్ చేస్తూ విడుదల కావడం కష్టం. దీనికితోడు మండుతున్న ఎండలలో ఓట్ల కోసం పవన్ జనం మధ్యకు వెళితే ఈ ఎండ వేడి వల్ల మళ్ళీ పవన్ ముఖంలో గ్లో కోల్పోయే ఆస్కారం ఉంది. ఈ పరిస్థితులలో స్థానిక సంస్థల ఎన్నికలు 'వకీల్ సాబ్' కు గండంగా మారాయా అంటూ దిల్ రాజ్ తల పట్టుకుంటున్నట్లు టాక్..



బయటపడ్డ నాని సుధీర్ బాబుల ఇగో వార్ !

వామ్మో ప్రదీప్ మాచి రాజు మామూలోడు కాదు.. అతని సినిమా వెనుక రెండు పెద్ద ప్రొడక్షన్స్..!

ఇంకెందుకు ఆలస్యం ? కొత్త పార్టీ పెట్టేయ్ రేవంత్ !

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald