Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డ్రాగన్:గ్లింప్స్ తో విధ్వంసం సృష్టిస్తున్న ఎన్టీఆర్..!

డ్రాగన్:గ్లింప్స్ తో విధ్వంసం సృష్టిస్తున్న ఎన్టీఆర్..!

న్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైడెడ్ చిత్రం డ్రాగన్. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కొన్ని లీక్స్ ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా డ్రాగన్ సినిమా నుంచి సడన్ సర్ప్రైజ్ విడుదల చేసింది చిత్రబృందం.

నాలుగు నిమిషాల నిడివి కలిగి ఉన్న ఒక గ్లింప్స్ విడుదల చేయగా ఇందులో ఎన్టీఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా పవర్ఫుల్ లుక్ లో కనిపించారు. ఈ గ్లింప్స్
ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా కనిపిస్తోంది. ఈ సినిమా 2027 జూన్ 11న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా స్టోరీ స్వాతంత్రం ముందు బ్రిటీష్ వాళ్ళు ఇండియాకు రావడంతో ప్రారంభమవుతుంది. 1967 నుంచి ఈ సినిమా కథ మొదలవుతుంది. ముఖ్యంగా ఓపియం పాపి అనే మొక్క నుంచి ఈ సినిమా స్టోరీ మొదలవుతున్నట్లుగా గ్లింప్స్ లో చూపించారు.

ఎన్టీఆర్ లూగర్ పాత్రలో కనిపించబోతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ బ్యాక్గ్రౌండ్ అందించిన బిజిఎం కూడా అదిరిపోయేలా ఉంది. అలాగే
ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ "దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు. ట్రిగర్ నొక్కగానే మర్చిపోవడం, నిద్ర పోయినప్పుడు నేను చంపిన వాళ్ళ ముఖాలు నా కలలోకి రావు. మిగిలిన శత్రువుల ముఖాలే నాకు కనిపిస్తాయి, పొరపాటున కూడా నువ్వు నా కలలోకి రావద్దు " అంటూ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది. మొత్తానికి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా మీద మరింత అంచనాలు పెంచేసేలా చేశారు. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా సినిమా షూటింగ్ వాయిదా వల్ల వచ్చేయేడానికి విడుదల చేయబోతున్నారు.

" style="height: 370px;">



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald