Wednesday, 08 Jul, 2.00 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
ఎంత ఇచ్చినా సరే ఆ కొత్త హీరో సినిమా థియేటర్లలోనే రిలీజ్ చేస్తారట....

కరోనా దెబ్బకు సినీ ఇండస్ట్రీ కకావికలం అయిపోయింది . లాక్ డౌన్ నుండి మినహాయింపులు వచ్చాక ప్రభుత్వాలు షూటింగ్ చేసుకోండి అని అనుమతులు ఇస్తున్నా భయంతో ఎవరూ ముందుకు రావడం లేదు . ఇక షూటింగ్ పూర్తి అయిపోయిన సినిమాలు విడుదల చేసేందుకు థియేటర్లు మూసేసి ఉన్నాయి . ముందు ఆగస్టు లో తిరిగి ఓపెన్ అవుతాయని అనుకున్నా . ఇప్పుడు దసరా సమయానికి మొదలైతే గొప్ప అని అంతా అనేస్తున్నారు . ఈ సమయంలో చిన్న మరియు మీడియం బడ్జెట్ ప్రాజెక్టులు ఓటిటి ప్లాట్ఫామ్స్ వైపు చూస్తున్నాయి .

సినిమా మొత్తం పూర్తయిపోయి తమకు వడ్డీలు పెరుగుతున్న నేపథ్యంలో నిర్మాతలు ఓటిటి ప్లాట్ఫామ్స్ నుండి మంచి డీల్స్ వస్తే వెంటనే తమ సినిమాను వారికి అమ్మేస్తున్నారు . ఇక పెద్ద సినిమా నిర్మాతలు డిసెంబర్ , సంక్రాంతి రిలీజ్ పైన దృష్టి పెడుతున్నారు . కానీ మీడియం బడ్జెట్ సినిమా మాత్రం అసలు ఎంత ఇచ్చినా మేము వాటికి మొగ్గు చూపే అవకాశం లేదని అంటున్నారు .

మెగా హీరో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ఆరంగ్రేటం చేస్తున్న ' ఉప్పెన ' సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు . ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తి కాగా దాని బడ్జెట్ పాతిక కోట్లు గా చెబుతున్నారు . సుకుమార్ కథను సమకూర్చిన ఈ చిరానికి దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందించగా ఆడియో సూపర్ డూపర్ హిట్ అయింది .

ఇకపోతే ఉప్పెన సినిమా హక్కుల కోసం రీసెంట్ గా మూడు ఓటిటి కంపెనీలు ఎంక్వయిరీ చేసాయి . ఎన్నాళ్లయినా , ఎంత వడ్డీ పెరిగినా థియేటర్లోనే సినిమా రిలీజ్ అవుతుందని మైత్రి మూవీస్ తేల్చేసిందట . ఈ చిత్రం పైన ఇప్పటికే పాతిక కోట్ల లెక్క తేలిందట . అంత మొత్తం ఈ రేంజ్ సినిమాకు ఓటిటి ద్వారా వచ్చే అవకాశమే లేదు . థియేట్రికల్ గా ఈ చిత్రం సంచలనం అవుతుందని నిర్మాతల నమ్మకం . అందుకే ఆ స్థాయిలో ఖర్చు పెట్టేసారు . కరోనా వారి ప్రణాళిక పాడు చేసినా కానీ మంచి సీజన్లో రిలీజ్ చేస్తే సినిమాకు ఢోకా ఉండదని నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు .విజయం మీదే : చేసే పనిని ప్రేమిస్తే ఏ పనిలోనైనా విజయం మీ సొంతం

ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ని పునాదులతో నిలబెట్టిన వైఎస్

చైనా..1962 నాటి సీన్ రిపీట్ ?

రాజన్న కథ వెండితెర బ్లాక్ బస్టర్

తెలుగు జనాల ఇలవేలుపు వైఎస్సార్

వైసీపీలో ప్రకంపనలు.. మోదీకి జై కొట్టిన మరో నేత..!

నెంబర్ 202 అంటే.. వైఎస్ మండి పడేవారు.. రీజన్ ఏంటంటే..!

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Arun Showri Endluri

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top