Saturday, 19 Sep, 9.00 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో ప్రభుత్వం అప్రమత్తం..

ఉత్తర.. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణశాఖ తెలిపింది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు. తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది బలపడి ఈనెల 20వ తేదీ నాటికి ఈశాన్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అమరావతి కేంద్రం ప్రకటించింది. ఈ ప్రభావంవల్ల రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

తెలంగాణ, విదర్భ ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గర నైరుతి బంగాళాఖాతంలో 7.6 km ఎత్తు దగ్గర ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించారు. ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబరు 20వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని సూచించారు. ఇదిలా ఉండగా అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కడపలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో జిల్లాలో కుంటలు, చెరువులు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. వరద కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు గండికోట ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పెరగడంతో ముంపు ప్రాంత వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 2,46,685 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1 లక్ష 95 వేల 274 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 884.70 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 214.8450 టీఎంసీలుగా నమోదు అయ్యింది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

చంద్రన్న అరెస్ట్.. కారణం ఏంటి అంటే..?

ధోని అభిమానుల్లో ఉత్కంఠ

మహిళ తల వెంట్రుకల్లోకి పాము.. హైర్ క్లిప్ అనుకున్న మహిళ.. చివరికి..?

బాలీవుడ్ కాదు టాలీవుడ్ దే అగ్రస్థానం.. కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు..?

భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. 9 మందిని అరెస్ట్‌ చేసిన ఎన్‌ఐఏ..!

మోదీ ప్రభుత్వం చైనా బ్యాంకుల నుండి ఋణం తీసుకుందా...?

బిగ్ బాస్ లో ఆ కంటెస్టెంట్ మీద భారీ కుట్ర...?

భయ పడకండి మీకు మేమున్నాం:

అవినీతి అధికారులు మిమ్మల్ని జలగల్లాగ పీడిస్తున్నారా? మీకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరితో మొరపెట్టుకోవాలో మీకు తెలియడంలేదా? ఇండియా హెరాల్డ్ నిర్భయంగా మీ ఘోషను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళుతుంది. మీ బాధను పూర్తి వివరాలు, ఆధారాలతో సహా nofear@indiaherald.com కు నేడే పంపించండి.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top