Thursday, 17 Sep, 9.00 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
ఏపీలో స్కూల్స్ ఎప్పటినుంచంటే..? ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు..

అన్ లాక్ లో అన్నీ తెరుచుకుంటున్నా.. స్కూల్స్, కాలేజీలు తెరవడానికి మాత్రం ప్రభుత్వాలు సాహసం చేయడంలేదు. కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టేసినా.. అనుమతులు మాత్రం ఇంకా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈనెల 21నుంచి స్కూల్స్ తెరిచే ఉద్దేశంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికోసం తాజాగా మరోసారి మార్గదర్శకాలను రూపొందించింది. కోవిడ్‌-19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్‌ 4 ఆదేశాలను అనుసరించి స్కూళ్లను తెరవడంపై ఏపీ పాఠశాల విద్యా శాఖ తాజాగా మార్గదర్శకాలను ఇచ్చింది. దీంతో ప్రభుత్వ యాజమాన్యాల్లోని ఆయా విభాగాలు తమ పరిధిలోని స్కూళ్లను తెరిపించడంపై దృష్టి సారిస్తున్నాయి.
- కంటైన్‌మెంట్‌ జోన్లకు బయట ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ విద్యాసంస్థలు మాత్రమే తెరవాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. వీటిలో కూడా ఆన్‌లైన్‌ టీచింగ్, టెలీకౌన్సెలింగ్, విద్యావారధి తదితర కార్యక్రమాల కోసం 50 శాతం మంది టీచర్లు హాజరుకావాలని చెప్పింది. కొవిడ్ ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో మాత్రం స్కూల్స్ తెరవరు.- విద్యార్థులు ఒకరికొకరు కనీసం 6 అడుగుల దూరం పాటించేలా చూడాలి. ప్రతి ఒక్కరూ ఫేస్‌మాస్కు ధరించడం తప్పనిసరి.
- దగ్గు, జలుబు, శ్వాస సంబంధ సమస్యలుంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటివారు వినియోగించే టిష్యూ పేపర్లు, కర్చీఫ్‌లను నిర్దేశిత ప్రదేశంలో దూరంగా పడేసేలా చూడాలి.
- నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, వాటర్‌బాటిళ్లు విద్యార్థులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడాానికి అనుమతి లేదు.
- ఒకటినుంచి 8 తరగతుల విద్యార్థులు ఇంటి వద్దనే చదువుకోవాలి. వారెవరినీ స్కూళ్లకు రప్పించకూడదు. వీరికి సంబంధించి వర్క్‌షీట్లను అభ్యాస యాప్‌లో పొందుపరిచారు. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని అభ్యసనం కొనసాగించేలా చూడాలి.

- ఈ నెల 21 నుంచి కంటైన్‌మెంట్‌ జోన్ల బయట తెరిచే స్కూళ్లు, కాలేజీల్లోకి 9, 10, ఇంటర్ విద్యార్థులను మాత్రమే సందేహాల నివృత్తికి అనుమతించాలి. ఇందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.
- ఆయా తరగతులు బోధించే టీచర్లు.. విద్యార్థుల స్థాయిని అనుసరించి హైటెక్, లోటెక్, నోటెక్‌గా విభజించాలి. అందుకు తగ్గట్టు ప్రణాళికలు రూపొందించుకొని మార్గనిర్దేశం చేయాలి.
- గురుకుల పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థుల విషయంలో టీచర్లు వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేయించి గైడెన్స్‌ ఇవ్వాలి.
- ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు 9,10, ఇంటర్ విద్యార్థుల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలను కూడా విద్యా శాఖ కమిషనర్‌ ఉత్తర్వుల్లో పొందుపరిచారు.

టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లేపేసిన బిగ్ బాస్-4 సీజన్..

అల్లు అర్జున్ పై పోలీస్ కేసు.. అసలేం జరిగింది..?

ఎనిమిది నెలల గ్యాప్ తర్వాత షూట్ కి అల్లు అర్జున్ ?

మహేష్ తో పూరిని కలపాలని చూస్తున్న నిర్మాత...?

మంచి పనికోసం ముందుకొస్తున్న నాగబాబు..

పవన్ బాలయ్య కలసే వస్తారా ?

ట్రంప్ వ్యూహం భారతీయుల కోసమేనా..?

భయ పడకండి మీకు మేమున్నాం:

అవినీతి అధికారులు మిమ్మల్ని జలగల్లాగ పీడిస్తున్నారా? మీకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరితో మొరపెట్టుకోవాలో మీకు తెలియడంలేదా? ఇండియా హెరాల్డ్ నిర్భయంగా మీ ఘోషను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళుతుంది. మీ బాధను పూర్తి వివరాలు, ఆధారాలతో సహా nofear@indiaherald.com కు నేడే పంపించండి.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top