Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎర్రిపు : హీరోయిన్, డైరెక్టర్ లవ్.. ఐదేళ్లుగా ప్రేమ.. పెళ్లెప్పుడంటే మాత్రం..!

ఎర్రిపు : హీరోయిన్, డైరెక్టర్ లవ్.. ఐదేళ్లుగా ప్రేమ.. పెళ్లెప్పుడంటే మాత్రం..!

కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ల మధ్య ప్రేమ విషయం అందరికి తెలిసిందే. కొద్దిరోజులు సీక్రెట్ గా నడిపించిన వీరి ప్రేమ వ్యవహారం బట్టబయలు అవడంతో వాళ్లు కూడా పబ్లిక్ గా రెచ్చిపోతున్నారు.మాములుగా అయితే హీరోయిన్లు హీరోలతో ప్రేమలో పడతారు. నయన్ కూడా ముందు శింబుతో ఆ తర్వాత ప్రభుదేవాతో లవ్ ఎఫైర్ నడిపించింది. ఒకానొక దశలో ప్రభుదేవాతో పెళ్లికి సిద్ధమైన నయన్ మళ్ళీ వెనకడుగు వేసింది.



ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యాక పూర్తిగా సినిమాల మీద దృష్టి పెట్టిన నయనతార డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో మళ్ళీ లవ్ లో పడ్డది. డైరెక్టర్ హీరోయిన్ ఈ కొత్త లవ్ స్టోరీ క్రేజీగా మారింది. నయన్ సినిమాల సెలక్షన్ లో కూడా సపోర్ట్ గా ఉంటూ నయనతార కెరియర్ ఇంకాస్త స్ట్రాంగ్ అయ్యేలా చేశాడు.

అయితే చూస్తూ చూస్తూనే వీళ్ళ ప్రేమకు ఐదేళ్లు పూర్తయ్యాయట. నిన్న వాలెంటైన్స్ డే సందర్బంగా విఘ్నేష్, నయన్ ఫోటో పోస్ట్ చేస్తూ మా ప్రేమకు ఐదేళ్లంటూ కామెంట్ పెట్టాడు.

అయితే ప్రేమించుకోవడం సరే ఇంతకీ పెళ్ళెప్పుడు అంటే మాత్రం సైలెంట్ అవుతారు. ఇద్దరు ప్రేమలో ఉన్నాం అని కన్ ఫర్మేషన్ లేకుండానే పెళ్లి చేసుకుంటున్న ఈ రోజుల్లో విఘ్నేష్, నయన్ లు మాత్రం ఇప్పటికి పెళ్లి ఊసు ఎత్తట్లేదు. పెళ్లికి ముందే సాధ్యమైనంత వరకు సినిమాలు చేసి బాగా డబ్బులు కూడబెట్టుకోవాలని అనుకున్నారు కాబోలు.. అందుకే సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. ఎప్పుడు ఫోటోలు దిగి పెట్టడమేనా లేక పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా లేదా అని వాళ్లపై ప్రశ్నల దాడి చేస్తున్నారు. నయన్ మాత్రం 100 సినిమాలు పూర్తి చేశాక కాని పెళ్లి గురించి ఆలోచిస్తుందట. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ కూడా విజయ్ సేతుపతి సినిమా చేస్తున్నాడు.



దేవరకొండ కసికి సరైన డైరక్టర్ పడితే..!

ఏపీ ఇంటిలిజెన్స్ బాస్ గా ఆయనే వస్తాడా ? మోదీని జగన్ ఒప్పించాడా ?

ట్రంప్ ఎఫెక్ట్ : నిమిషానికి 55 లక్షలు ఖర్చా..వామ్మో...!!!

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald