Friday, 24 Sep, 8.05 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
గుంటూరు వైసీపీలో ఆధిపత్య పోరు!

గుంటూరు జిల్లా వైసీపీలో జగనన్న ఇళ్ల స్థలాల్లో పనులపై పెత్తనానికి కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ఇటీవల పనుల పరిశీలన కోసం వచ్చిన జిల్లా ఇంచార్జ్ ఇంచార్జ్ మంత్రి ఎదుటే వైసీపీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు బహిర్గతం కావడం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న ఇండ్ల పథకాన్ని చేపట్టింది. అయితే ఈ పథకం ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కాసుల వర్షం కురిపిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగనన్న ఇళ్ల స్థలాల్లో అభివృద్ధి పనులను దక్కించుకునేందుకు వైసీపీ శాసనసభ్యులు తెగ పోటీ పడుతున్నారు. ఇప్పటికే స్థలాల కొనుగోలుకు సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ప్రచారం జోరుగా జరుగుతోంది. స్థలాల పంపిణీ కార్యక్రమం పూర్తయ్యాక ప్రస్తుతం వాటికి సంబంధించిన లేఅవుట్ మౌలిక మౌలిక సదుపాయాలను కల్పించే విషయంలో వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. గుంటూరు సిటీ ఎమ్మెల్యేలకు తాడికొండ శాసనసభ్యురాలికి మధ్య ఈ విషయంలో కోల్డ్‌వార్‌ నడుస్తుందట తాడికొండ నియోజకవర్గంలోని పేరేచర్ల గ్రామాలలోని స్థలాలు తన నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి కనుక.. మౌలిక సదుపాయాల కల్పన తన ఆధ్వర్యంలోనే జరగాలని తాడికొండ శాసనసభ్యురాలు భావిస్తున్నారట. లబ్ధిదారులు అందరూ గుంటూరు సిటీ పరిధిలోని నియోజకవర్గాల వారే కనుక.. వారి పనులు మేమే దగ్గరుండి జరిపిస్తామని గుంటూరు నగర ఎమ్మెల్యేలు అక్కడ ఇస్తున్నారని టాక్.

అయితే గుంటూరు సిటీ వాసులకు జగనన్న కాలనీ జగనన్న ఇళ్ల కాలనీల కోసం నగరానికి చేరువలోని పేరేచర్ల, లాం గ్రామాలకు దగ్గర స్థలాలను కొనుగోలు చేసి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో కోట్ల రూపాయలు వ్యయం చేసి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలి. ఈ స్థలాలు, ఇందులోని మౌలిక సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించడానికి ఇటీవల హౌసింగ్ జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీ రంగనాథ రాజు గుంటూరు సిటీకి వచ్చారు. ముందుగా తాడికొండ నియోజకవర్గం పరిధి పేరేచర్ల గ్రామంలోని స్థలాల దగ్గరకు వెళ్లారు. స్థలాల పరిశీలన చేస్తున్న సమయంలో ఇంచార్జ్ మంత్రి శ్రీ రంగనాథ రాజుతో పాటు గుంటూరు తూర్పు పశ్చిమ శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరిధర్ ఉన్నారు అయితే స్థానిక శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఈ పరిణామం ఇంచార్జ్‌ మంత్రి శ్రీరంగనాథరాజుకి తేడాగా అనిపించింది. దీంతో ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే తర్వాత జరగాల్సిన లాం గ్రామ పర్యటనను రద్దు చేసుకొని వెనుదిరిగి వెళ్లారు.

జగనన్న ఇళ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారుల నుంచి, అంతకుముందు స్థలాల కొనుగోలు విషయంలో రైతుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి స్థలాలు కొనుగోలు విషయంలోనే ఒక ఎకరానికి రైతుల నుంచి 10 లక్షల రూపాయల దాకా వసూలు చేసినట్లు ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు స్థలాల్లో మౌలిక సదుపాయాలను కల్పించే విషయంలో ప్రభుత్వం కేటాయించిన కోట్లాది రూపాయల పై వైసీపీ ఎమ్మెల్యేల కన్నుపడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ స్థలాల పనులపై ఆధిపత్యం కోసం గుంటూరు సిటీ ఎమ్మెల్యేలకు తాడికొండ శాసనసభ్యురాలుకి మధ్య విభేదాలు తలెత్తాయనే చర్చ జోరుగా జరుగుతోంది. మరి ఈ ఆధిపత్య పోరు మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

బాలు వర్ధంతి... నివాళిగా బుక్ విడుదల

వైసీపీ జెడ్పీ చైర్మన్ లు వీళ్ళే

తన గురువుని ఒక ఆట ఆడుకున్న బండి సంజయ్...?

రేవంత్ ఫాన్స్ ను వదలొద్దు.. జగ్గారెడ్డి ప్రకటన!

ప్రధాని మోడీ బొమ్మ వద్దు !

కేసీఆర్ అనే మూర్ఖుడు నాశనం చేస్తున్నారు!

మోడీకి.. మతరాజకీయ సెగ..

సెక్రటరిని రేప్ చేసిన బాస్‌.. 10వ అంతస్తుపై నుంచి తోసేసి..

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top