Thursday, 04 Mar, 8.14 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

తమిళనాడు
హైదరాబాదీలకు జీహెచ్ ఎంసీ బంపర్ ఆఫర్‌.... ఏం చేస్తోందో తెలుసా..?

పన్ను చెల్లింపుదారులకు మరోసారి బంపర్‌ ఆఫర్ ప్రకటించింది జీహెచ్ఎంసీ. పన్ను వసూళ్లను వేగిరం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రొత్సాహాకాలను ప్రకటిస్తోంది. ఈకోవలోనే 2020 -21 ఏడాదికి సంబంధించిన పన్ను చెల్లింపుదారులు ఈ నెల 31 లోపు చెల్లిస్తే 90 శాతం వడ్డి మినహాయింపునివ్వనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2020 సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 31 వరకు 45 రోజుల పాటు వన్ టైం స్కీం (ఓటీఎస్)ను జీహెచ్ఎంసీ అధికారులు అమలు చేశారు. ఆ తర్వాత నవంబర్ 15 వరకూ పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గతేడాది డిసెంబర్ 28న రాసిన లేఖకు స్పందిస్తూ ఓటీఎస్‌ను మరోసారి అమలు చేసేందుకు ఎంఏయూడీ అంగీకరించింది. దీంతో ఈ నెల 31 వరకూ అమల్లో ఉంటుందని, పన్ను చెల్లింపుదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ సూచించింది.

ఈ నెలాఖరుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం మరోసారి అద్భుత అవకాశాన్ని కల్పించింది. మొండి బకాయిదారులకు 90శాతం వడ్డీ నుంచి మినహాయింపునిస్తూ 'వన్‌ టైమ్‌ స్కీమ్‌(ఓటీఎస్‌)కు చాన్స్‌ ఇస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది సెప్టెంబరు నుంచి 45 రోజుల పాటు ఓటీఎస్‌కు అవకాశం ఇవ్వగా జీహెచ్‌ఎంసీ 275 కోట్లు వసూలు చేయగా, ఇంకా 1243కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. ఈ బకాయిలపై సుమారు 124 కోట్ల వడ్డీ ఉండగా, ప్రస్తుతం ఓటీఎస్‌ అమలుతో ప్రజలపై ఈ భారం తగ్గనుంది. సెప్టెంబర్‌లో ఓటీఎస్‌ అమలు సమయంలో రికార్డు స్థాయి వర్షాలు, సహాయక చర్యలతో చాలా మందికి సద్వినియోగం కాలేదని, బకాయిదారులు పెద్ద సంఖ్యలో ఉన్న దృష్ట్యా మరోసారి అవకాశం ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ గత నెలలో ప్రభుత్వానికి లేఖ ద్వారా కోరింది.

జీహెచ్ఎంసీ బడ్జెట్ రోజురోజుకూ దిగజారిపోతోంది. బల్దియా కష్టాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అప్పులతో నెట్టుకొస్తున్న బల్దియా ఖజానాపై వరదలు, ఎన్నికలు మరింత భారాన్ని మోపాయి. అధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో నెలనెలా రావాల్సిన పన్నులు వసూలు కాలేదు. ఒకప్పుడు కాసులతో గలగలలాడిన బల్దియా ఖజానా కాలం గడుస్తున్న కొద్దీ వెలవెలబోతోంది. జీహెచ్ఎంసీకి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు కరిగిపోయాయి. మరో వైపు పన్నుల వసూళ్లు తగ్గిపోయాయి. వరుసగా కరోనా, ధరణి, వరదలు, తాజాగా ముగిసిన ఎన్నికలు గ్రేటర్ కార్పొరేషన్‌ను ఆర్థిక కష్టాల ఊబిలో ముంచేశాయి.

ఆదిపురుష్‌లో సీతమ్మగా ఆ అమ్మడు ఫిక్స్‌...

పుర పోరు: పశ్చిమలో ఆ ఒక్క మహిళతో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పురపోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జన్యాలు.. ఏకగ్రీవాలు

క్రిష్ పవన్ మూవీ లైన్ లోకి మరో డైరెక్టర్...?

అనుపమ పరమేశ్వరన్ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!?

ఆ ఎమ్మెల్యే మనిషిగా వైసీపీలో.. మనసంతా టీడీపీలో ?

పుర పోరు: గుంటూరులో రెండు మున్సిపాల్టీల్లో వైసీపీ స్వీప్‌... టీడీపీకి గుండు సున్నా

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top