Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హరుడు రివ్యూ: మెప్పించిన పోలీస్ డ్రామా!

హరుడు రివ్యూ: మెప్పించిన పోలీస్ డ్రామా!

టీనటులు: వెంకట్, నటాషా సింగ్, హెబ్బా పటేల్, సలోని, వేద్విక సోనీ, సుమన్, అలీ, శ్రీహరి పైలా తదితరులు

దర్శకత్వం: రాజ్ తల్లూరి

నిర్మాతలు: డిక్కల లక్ష్మణరావ్, ప్రవీణ్ రెడ్డి వి
సంగీతం: మణిజెన్నా

సినిమాటోగ్రఫీ: ఆనంద్ మరుకుర్తి

ఎడిటర్: ఉప్పు మారుతీ

బ్యానర్: వీ ఆర్ ఎంటర్టైన్మెంట్స్

విడుదల తేదీ: 15 మే 2026

'శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి', 'ఆనందం', 'శివరామరాజు' వంటి చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు వెంకట్. ఇటీవల పవన్ కళ్యాణ్ 'ఓజి' సినిమాలో మెరిసిన ఆయన, చాలా కాలం తర్వాత 'హరుడు' చిత్రంతో మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ యాక్షన్ పోలీస్ డ్రామా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథా నేపథ్యం
ముంబై మాఫియాను గడగడలాడించిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ డిసిపి శంకర్ (వెంకట్) హైదరాబాద్‌కు బదిలీ అవుతాడు. నగరంలో అడుగుపెట్టడమే ఆలస్యం.. క్రిమినల్స్ ఆట కట్టిస్తూ తన మార్క్ చూపిస్తాడు. ఈ క్రమంలోనే బయటకి మంచివాడిగా నటిస్తూ, లోపల అక్రమ దందా నడిపే లోకల్ ఎమ్మెల్యే వరదరాజులు (శ్రీహరి పైలా)తో శంకర్‌కు వైరం మొదలవుతుంది.

మరోవైపు, సొంతంగా 'ఫుడ్ కోర్ట్' పెట్టుకోవాలనే కల నిజం చేసుకోవడం కోసం కొందరు నిరుద్యోగ విద్యార్థులు కార్ల ఇంజిన్లను దొంగతనం చేస్తూ పోలీసులకు దొరికిపోతారు. వారిని విడిపించడానికి వరదరాజులు స్టేషన్‌కు వస్తాడు కానీ, బయటకు రాగానే ఆ స్టూడెంట్స్‌పై ఘోరమైన దాడి జరుగుతుంది. ఈ దాడి వెనుక ఉన్నది వరదరాజులే అని తెలిసి
శంకర్ షాక్ అవుతాడు.

అసలు ఆ కార్ ఇంజిన్ల దొంగతనానికి, వరదరాజులు రాజకీయ భవిష్యత్తుకు ఉన్న లింక్ ఏంటి? మంచివాడి ముసుగులో ఉన్న వరదరాజుల అసలు స్వరూపాన్ని శంకర్ ఎలా బయటపెట్టాడు? ఈ కథలో శంకర్ భార్య ప్రియ (నటాషా సింగ్) హత్యకు ఉన్న సంబంధం ఏంటి? అనేది మిగతా సినిమా.

సినిమా ఎలా ఉందంటే..?
ప్లస్ పాయింట్స్:
వెంకట్ వన్ మ్యాన్ షో: సుదీర్ఘ విరామం తర్వాత వచ్చినా వెంకట్ తన ఫిట్‌నెస్‌తో, లుక్స్‌తో పోలీస్ ఆఫీసర్ పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. ఆయన పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలం.

నటీనటుల ప్రతిభ: తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ నటాషా సింగ్ తన గ్లామర్‌తో ఆకట్టుకోగా, హెబ్బా పటేల్, సలోని (ఐటమ్ సాంగ్), అలీ తమ వంతుగా మెప్పించారు. విలన్‌గా శ్రీహరి పైలా నటన బాగుంది.

కమర్షియల్ ఎలిమెంట్స్ & రన్ టైమ్: ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, హీరో-హీరోయిన్ల కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యాయి. సినిమా రన్ టైమ్ తక్కువగా ఉండటం, బోర్ కొట్టకుండా సాగడం పెద్ద ప్లస్.


మైనస్ పాయింట్స్:
పాత చింతకాయ పచ్చడి కథనం: సినిమా కథ, మేకింగ్ స్టైల్ చాలా పాతవిగా అనిపిస్తాయి. తర్వాత సీన్ ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఈజీగా ఊహించేయవచ్చు

రొటీన్ క్లైమాక్స్: ముగింపు కూడా అందరూ ఊహించినట్టే ముగుస్తుంది తప్ప ఎలాంటి కొత్తదనం ఉండదు.

సాంకేతిక వర్గం :

దర్శకుడు రాజ్ తల్లూరి ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా.. పాటలు, ఫైట్లు, కామెడీ కలగలిపి పక్కా కమర్షియల్ ఫార్మాట్‌లో ఎక్కడా ల్యాగ్ లేకుండా నడిపించడంలో సక్సెస్ అయ్యారు. ఆనంద్ మరుకుర్తి విజువల్స్, మణిజెన్నా సంగీతం సినిమా మూడ్‌కు తగ్గట్టుగా కుదిరాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి.

చివరిగా..
'హరుడు' పాత కథే అయినా.. కమర్షియల్ ఫార్ములాను నమ్ముకుని తీసిన యాక్షన్ డ్రామా. ఊహకందే కథనమే అయినప్పటికీ, వెంకట్ పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్, ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్ వల్ల మాస్ మరియు యాక్షన్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా నిరాశపరచదు.

రేటింగ్: 2.75 / 5

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald