Friday, 24 Sep, 9.34 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
హీరో శివాజీ ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడుగు పెట్టి , ఆ తర్వాత హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న హీరోలలో హీరో శివాజీ కూడా ఒకరు. ఈయన స్టార్ హీరోల సినిమాలలో సహాయక పాత్రల్లో నటించి , ఆ తర్వాత చిన్న చిన్నగా సినిమాలలో చేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడం మొదలు పెట్టాడు.. ఈయన నటించిన ఎన్నో సినిమాలలో .. ఈయనకు మిస్సమ్మ సినిమా మంచి ఇమేజ్ ను తీసుకొచ్చి పెట్టింది అని చెప్పాలి.. భూమిక , లయ తో కలిసి నటించిన శివాజీ కి మంచి పేరు వచ్చింది..

శివాజీ పూర్తి పేరు శివాజీ సొంటి నేని.. గుంటూరు జిల్లాలో గిరిజ వోలు గ్రామంలో జూన్ 30వ తేదీన ఒక మధ్యతరగతి కుటుంబంలో శివాజీ జన్మించారు. డిగ్రీ పూర్తి చేసుకుని , హైదరాబాద్ కు వచ్చిన కొత్తలో ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు దగ్గర.. ఎడిట్ షూట్ లో పనిచేశారు. హైదరాబాదులో ఏదైనా ఉద్యోగం చేసుకొని డబ్బు సంపాదించాలనే ఆలోచనతో శివాజీ హైదరాబాద్ కు రావడం జరిగింది. అప్పుడే ప్రారంభమైన జెమినీ టీవీలో శివాజీకి వీడియో ఎడిటర్ గా అవకాశం లభించింది. ఎడిటర్ గా జాయిన్ అయిన శివాజీకి అదే ఛానల్ లో యాంకర్ గా చేసే అవకాశం కూడా లభించింది.

ఇక జెమినీ టీవీలో చిన్న చిన్న షోలకు యాంకర్ గా చేస్తూ మంచి పాపులారిటీని అందుకున్నాడు. శివాజీ లో ఉన్న మంచి కామెడీ టైమింగ్ సినిమా ఇండస్ట్రీ లో రావడానికి సహాయ పడింది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు 2000 సంవత్సరంలో పరదేశి సినిమా లో దర్శకత్వం వహిస్తున్న నేపథ్యంలో, నటీనటుల కోసం స్టార్ 2000 అనే ఒక కాంటెస్ట్ నిర్వహించారు. రెండవ స్థానంలో లయ, శివాజీ నిలిచారు.అలా చిన్నగా మొదలైన శివాజీ కెరియర్ .. మొదటిసారి మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేశాడు.

అయితే మొదట వై.వి.ఎస్.చౌదరి సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి సినిమా లో హీరో స్నేహితుడు పాత్రలో నటించడానికి అవకాశం ఇచ్చాడు. ఖుషి, ఇంద్ర సినిమాలో కూడా శివాజీ కి మంచి పేరు వచ్చింది. ఇక మొదటిసారి మిస్సమ్మ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన శివాజీ , మంచి గుర్తింపు పొందాడు. ఉల్లాసంగా ఉత్సాహంగా, దిల్, పిజ్జా వంటి సినిమాలలో హీరోలకు డబ్బింగ్ అందించాడు. 2013లో దిల్ సినిమాకు నితిన్ కోసం డబ్బింగ్ చెప్పిన శివాజీకి నంది అవార్డు కూడా లభించింది.

ఇక సినీ ఇండస్ట్రీకి దూరమై రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. బిజెపి పార్టీలో చేరి, ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం పోరాడుతున్న సమయంలో బీజేపీ మోసం చేసిందని బీజేపీ పార్టీకి రాజీనామా చేశాడు. ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం పోరాడుతూ 48 గంటల నిరాహార దీక్ష చేశాడు. ఆపరేషన్ ద్రవిడ పేరుతో ప్రత్యర్థులకు మాటల తూటాలు విసిరారు. ఇక ఇప్పటికి రాజకీయాల్లో కొనసాగుతూ.. ప్రభుత్వం చేసే తప్పులను చూపిస్తూ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మిగులుతారు శివాజీ.

తెలంగాణ బస్సు : ఆర్టీసీ సర్వీసులు జేసీ కొట్టేస్తాడా?

అమెరికా టూర్‌తో చైనాకు మోడీ చెక్‌..!

బిగ్ బాస్ 5: వారిద్దరి విషయంలో సరయు చెప్పింది నిజమేనా?

టీటీడీలో అడుగు పెట్టిన అంబానీ ఫ్యామిలీ...?

బ్రేకింగ్: జగన్ ఢిల్లీ టూర్, షా ఏమంటారో...?

ఆ ఒక్క సీన్ చాలు లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్ అని చెప్పడానికి!!

సినీ ఫక్కీలో కోర్టులో కాల్పులు.. ముగ్గురు మృతి?

మంచిమాట: పెను ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే.. సరైన ఆలోచన ఉండాలి..!

సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డు..!

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top