Tuesday, 21 Jan, 12.05 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
ఇది రూమరా నిజమా .. ఈవిడ బయోపిక్ ఏంటి ..?

ప్రస్తుతం నయనతార కోలీవుడ్, టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది. అంతేకాదు రెమ్యూనరేషన్ పరంగా కూడా నయన్ మిగతా హీరోయిన్స్ కంటే ఎక్కువ అందుకుంటుందన్న విషయం కూడా తెలిసిందే. ఇక టాలీవుడ్ లో దాదాపు అందరితోని స్క్రీన్ షేర్ చేసుకుంది. కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ తో సహా దాదాపు అక్కడ కూడా అందరితోను నటించింది. ఇక నయనతార హీరోయిన్ గా ఎంత పాపులర్ అయిందో తన పర్సనల్ లైఫ్ లో కూడా అంతే పాపులర్ అయింది. వ్యక్తిగత విషయాలలో ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంది. ముఖ్యంగా తను నడిపిన ప్రేమాయణాలు గురించి చెప్పాల్సిన పనిలేదు. శింబుతో లవ్ బ్రేకప్ అయిన తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. అది కూడా విఫలమవ్వడం అందరికీ తెలిసిందే.

ఈ రెండు నయన్ కెరీర్ ని బాగా దెబ్బతీశాయని అందరూ అంటుంటారు. కానీ నయన్ మాత్రం ఇవేవి పట్టించుకోలేదు. తన పాటికి తను అలా సాగిపోతూనే ఉంది. అందులో భాంగానే దర్శకుడు విఘ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో పడింది. ప్రస్తుతం విఘ్నేష్ తో డీప్ లవ్ లో ఉంది నయనతార. త్వరలో పెళ్లితో ఈ జంట ఒకటి కాబోతున్నారన్న ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. తాజాగా ఆ ఇద్దరూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి సిద్ధమవుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ ఇద్దరి రియల్ రొమాన్స్ ని రీల్ రొమాన్స్ గా తెరపై చూపించే ప్రయత్నాలు చేస్తున్నారట. సైలెంట్ గా నయన్-విఘ్నేష్ ల ప్రేమ కథను సినిమాగా తెరకెక్కించి సర్ ప్రైజ్ చేస్తున్నారట. ఇది ఒక రకంగా అందాల నయనతార జీవితకథతో తెరకెక్కుతున్న సినిమా అని అంటున్నారు. అందువల్ల నయన్ బయోపిక్ ఇలా చడీ చప్పుడు లేకుండా ప్లాన్ చేశారు అన్న టాక్ ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

నయనతార మొదటి రెండు ప్రేమకథల సంగతి వదిలేస్తే ప్రస్తుతం కొనసాగుతున్న ప్రేమ కథనే ముఖ్య కథాంశంగా ఎంచుకున్నారని కోలీవుడ్ మీడియా సమాచారం. 'త్రీ ఈజ్ ఏ కంపెనీ' అనే బ్యానర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. 'నానుమ్ సింగిల్ దాన్' అనే టైటిల్ ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విఘ్నష్ శివన్ పాత్రలో దినేశ్ నటిస్తున్నాడు. నయనతార పాత్రలో దీప్తి నటిస్తోంది. అసలు నయన్ ప్రేమ కథను సినిమాగా మలచాలి అన్న ఐడియా గోపీ అనే కొత్త దర్శకుడికి వచ్చిందని అని తెలుస్తోంది. తనే స్వయంగా కథను సిద్దం చేసి దర్శకత్వం వహిస్తున్నాడట.

తమిళనాడు లో నయనతారకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సినిమా చేస్తున్నామని దర్శకుడు గోపీ నిర్మొహమాటంగా తెలిపాడు. ఇద్దరి ప్రేమ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని... ఇద్దరి రొమాన్స్ సినిమాలో ఆసక్తికరంగా చూపిస్తున్నట్లు కూడా రివీల్ చేసి సినిమా మీద ఆసక్తిని పెంచాడు. ఇక సినిమాలో హీరో లక్ష్యం నయనతార లాంటి పాపులారిటీ ఉన్న అమ్మాయిని ప్రేమించి పెళ్లాడటమే టార్గెట్ గా కనిపిస్తాడుట. ఈ పాయిట్ కు నయన్-విఘ్నేష్ ల ప్రేమ కథను జోడించి సినిమాని ఆసక్తికరంగా తెరకెక్కించారట. మరి ఈ కథ ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top