Dailyhunt
ఇండియా లో బెస్ట్ సెల్లింగ్ కారు ఏదో తెలుసా..!!

ఇండియా లో బెస్ట్ సెల్లింగ్ కారు ఏదో తెలుసా..!!

ఇండియాలోని ఆటో మొబైల్ కార్లు రోజుకొకటి మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. ప్రముఖ కంపెనీలు గతంలో ఉన్న దానికన్నా మెరుగైన ఫీచర్లు ఉన్న కార్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 2020 లో ఎన్నో కంపెనీలు కార్లను మార్కెట్ లోకి విడుదల చేశారు. కరోనా కారణంగా కార్లు అనుకున్న స్థాయిలో సేల్ అవ్వలేదు. అన్నిటికన్నా ఎక్కువగా మారుతి కార్లు గత ఏడాదికి ఎక్కువగా అమ్ముడు పోయాయని తెలుస్తుంది.

మారుతి సుజుకికి చెందిన వాహనం అత్యధిక అమ్ముడైన కారుగా నిలిచింది. కోవిడ్-19 సంక్షోభంలో కూడా మారుతి స్విప్ట్‌ టాప్‌ బ్రాండ్‌గా ఖ్యాతి దక్కించుకుంది. 2020 ఏడాదిలో లక్షా అరవై వేలకుపైగా విక్రయాలతో ఈ రికార్డు సాధించింది.

టెక్‌ సావీ ఫీచర్లు, సరియైన ధర, స్పోర్టి డిజైన్‌లతో యువతరం మనుసు దోచుకుందని కంపెనీ వెల్లడించింది. స్విఫ్ట్ కస్టమర్లలో 53 శాతానికి పైగా 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారేనని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది కూడా అలాంటి కార్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. యువతను ఆకట్టుకునే విధంగా మున్ముందు వచ్చే కార్లను అందుబాటులోకి తీసుకు వస్తామని కంపెనీ ఎండీ తెలిపారు.

గత ఏడాది 1,60,700 యూనిట్లతో స్విఫ్ట్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే కార్‌గా నిలిచిందని మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్‌ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ శనివారం వెల్లడించారు. 15 సంవత్సరాలుగా 2.3 మిలియన్లకు పైగా వినియోగదారులతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా ఉందని పేర్కొన్నారు. 2005లో లాంచ్‌ చేసిన మారుతి స్విఫ్ట్‌ ఇప్పటికి 23 లక్షల యూనిట్ల మైలు రాయిని కూడా దాటేసిందన్నారు. ఇది 2010 లో 5 లక్షల మైలురాయిని, 2013 లో 10 లక్షలను, 2016 లో 15 లక్షలను దాటిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2021- 2022 ఏడాదిలో కూడా ప్రజలను ఆకట్టుకొనే కార్లను తయారు చేస్తామని తెలిపారు.



జగన్ భజన చేస్తున్న రాపాకకు ఫిక్స్ చేసిన పవన్...సైకిల్‌తో సవారీ ఉంటుందా?

కుక్క కోసం నేషనల్ హాలీడే ప్రకటించిన దేశాధ్యక్షుడు.. ఎందుకంటే..!?

హమ్మయ్య .... మొత్తానికి జేజమ్మ దర్శనం ... ఇదే అభిమానుల ఆనందానికి నిదర్శనం .....??

పవన్, క్రిష్ సినిమాలో నిధి ఎలా ఫైనల్ అయ్యిందో తెలుసా?

ఇక నా పెళ్లి అప్పుడే..కుండబద్దలు కొట్టేసిన యాంకర్ ప్రదీప్

ఆ టీడీపీ ఫైర్‌బ్రాండ్‌ను జగన్ ఇలా టార్గెట్ చేశారా ?

క్షణం క్షణం సినిమా సమయంలో శ్రీదేవి జీవితంలో జరిగిన అతి పెద్ద సంఘటన

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే...
ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald