Friday, 18 Oct, 9.12 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
జగన్ తాజా డెసిషన్‌: బాబోరు ఉక్కిరి బిక్కిరి

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ను ఇప్పుడు సమస్యలు చుట్టుముడుతున్నాయి. రోజుకో రకమైన సమస్యతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఏపీలో సీఎం జగన్ పరిపానల ప్రారంభించనప్పటి నుంచి చంద్రబాబుకు సమస్యలు ఒకదాని వెంట ఒకటి వచ్చి పడుతున్నాయి. అసలే అధికారం లేక సతమతమవుతున్న చంద్రబాబు సీఎం జగన్ నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో చంద్రబాబుకు ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. తాను అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు తంటాలు పడుతున్నారు.

అందులో భాగంగా తన అనుచరులను బీజేపీలోకి పంపి తన ఎత్తులను అమలు చేయవచ్చని భ్రమించారు. కానీ అవి నెరవేర్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం కూడా అందుకు సహాకరించేందుకు ఒప్పుకోవడం లేదనే టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో చంద్రబాబుకు దిమ్మతిరిగేంత పని అవుతుందట. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తనకు అనుకూలంగా వార్తలు రాసినందుకు ఆంధ్రజ్యోతికి అప్పనంగా భూములను కోట్ల విలువైన భూములను కట్టబెట్టారట.

అయితే ఆ భూములు ఇప్పుడు ఎలాంటి ఉపయోగం లేకుండానే ఉండటంతో వాటిని రద్దు చేస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో చంద్రబాబుకు గోటి చుట్టుపై రోకలి పోటు లాగా పరిస్థితి మారింది. ఇప్పటికే తాను అధికారంలో ఉన్నప్పుడు పీపీఏల పేరుతో ఎక్కువ ధరలకు విద్యుత్ ఒప్పందం చేసుకున్నాడనే ఆరోపణలతో సీఎం జగన్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయ ప్రయత్నించడం, అది కోర్టుకు చేరడం, కేంద్ర ప్రభుత్వం కూడా పీపీఏల రద్దు వద్దని వారించడం, కోర్టు జగన్ సర్కారుకు అనుకూలమైన తీర్పు ఇవ్వడం ఇలా చకచకా జరిగిపోయాయి. అంటే పీపీఏల పేరుతో చంద్రబాబు భారీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రుజువు అయినట్లే లెక్క.

ఇక పోలవరం ప్రాజెక్టులో గోల్‌మాల్ చూస్తే చెప్పవలసిన పనే లేదు. జగన్ సర్కారు టెండర్లను రద్దు చేసి రీ టెండరింగ్ చేపట్టింది. దీంతో దాదాపుగా రూ.800 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయింది. ఇంకా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అనుచరులు చేసిన ఆగడాలు అంతా ఇంతా కాదు.. ఓ చింతమనేని, ఓ యరపతినేని, ఓ కోడెల శివప్రసాద్‌రావు, నారాయణ, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లీస్టే ఉంటుంది. ఇలా వీరంతా అవినీతి అక్రమాలకు పాల్పడినవారే. ఇంకా చెప్పాలంటే.. చంద్రబాబు అద్దె కొంపలో ఉంటూ అక్రమ కట్టడాలను కూల్చవద్దని నీతులు చెప్పడం చూస్తుంటే అక్రమ కట్టడాలను చంద్రబాబు ఎంతగా ప్రోత్సహించారో అర్థమవుతుంది.

అంతే కాదు చంద్రబాబు చేసిన పాపంతో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ఓవైపు సీఎం జగన్ చేస్తున్న పరిపాలనతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతుండగా, మరోవైపు టీడీపీలోని నేతలందరిని వరుసబెట్టి బీజేపీ తనవైపుకు లాక్కుంటుంది. పార్టీ ఓవైపు బలహీనం అవుతుంది.. మరో వైపు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు వెంటాడుతున్నాయి.. ఇలా చంద్రబాబు గ్రాఫ్‌, పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుంది.. ఏదేమైనా చంద్రబాబుకు రాబోవు రోజుల్లో శంకరగిరి మాన్యాలు పట్టక తప్పదేమో... !

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top
// // // // $find_pos = strpos(SERVER_PROTOCOL, "https"); $comUrlSeg = ($find_pos !== false ? "s" : ""); ?>