Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జయం రవికి మద్దతు తెలిపిన.. టాలీవుడ్ హీరోయిన్..!

జయం రవికి మద్దతు తెలిపిన.. టాలీవుడ్ హీరోయిన్..!

కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకుల వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ప్రెస్ మీట్ లో జయం రవి మాట్లాడుతూ తన భార్య ఆర్తి ఆమె కుటుంబ సభ్యుల పైన పలు రకాల ఆరోపణలు చేయడం జరిగింది.
వివాహమైనప్పటి నుంచి తాను చాలా తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నానని, తనపైన చేతబడి చేయించారని, మానసిక క్షోభ అనుభవించానని మీడియో ముందు కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఈ విషయం పైన భార్య ఆర్తి కూడా కౌంటర్ వేసింది.

వీరి విడాకుల వ్యవహారంలో మరో నటి , రాజకీయ నాయకురాలు ఖుష్బూ ఎంట్రీ ఇచ్చారనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా జయం రవికి బహిరంగంగా మద్దతు చెబుతూ, ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ మీరా చోప్రా, రవి చెప్పిన మాటలు అందరూ వినాలని ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది. తనకు నటుడు జయం రవి చాలా బాగా తెలుసని అతను ఎంతో సున్నితమైన మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్నవారని ,ఈ రోజుల్లో కొంతమంది మహిళలు తమకు అనుకూలంగా ఉన్న చుట్టాలను, వ్యవస్థలను దుర్వినియోగం చేసుకుంటున్నారు. సమాజం ఎప్పుడూ కూడా ఒకరి పక్షాన్నే వినకూడదు మగవారి వెర్షన్ కూడా వినాలి అంటూ తెలియజేసింది.


అంతేకాకుండా రవిని చూస్తే చాలా బాధగా ఉంది అతనికి కచ్చితంగా న్యాయం జరుగుతుంది, నిజం గెలుస్తుందని ఆశిస్తున్నానంటూ ఆమె ట్విట్టర్ ద్వారా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో జయం రవికి మద్దతు పలుకుతూ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఈ ట్విట్టర్ ను మరింత వైరల్ గా చేస్తున్నారు. తెలుగులో కూడా మీరా చోప్రా బంగారం ,వాన తదితర చిత్రాలలో నటించింది. ఇక ఈమె ఎవరో కాదు గ్లోబల్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన ప్రియాంక చోప్రా కు కజిన్ సిస్టర్ అవుతుంది.

" style="height: 908px;">

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald