భానుచందర్, సునీత, సి కళ్యాణ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల
▪️ ఆకాష్-భైరవి జోడీతో రొమాంటిక్లవ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్
హైదరాబాద్: ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన తాజా చిత్రం 'కొత్త మలుపు' జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
▪️ ఆకాష్-భైరవి జోడీతో రొమాంటిక్లవ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్
హైదరాబాద్: ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన తాజా చిత్రం 'కొత్త మలుపు' జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
భైరవి ఆర్థ్యా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించగా, తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. తథాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ మూవీని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుంది.
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు భానుచందర్, ప్రముఖ గాయని సునీత, నిర్మాత సీ కళ్యాణ్, నటుడు రఘుబాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
గ్రామీణ నేపథ్యంలోని రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేమ, సస్పెన్స్, వినోదం సమపాళ్లలో ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఆకాష్, భైరవి బావ-మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారు. రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యశ్వంత్ సంగీతం అందించారు.
దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి మాట్లాడుతూ, 'రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జానర్‌లో ఈ సినిమాను రూపొందించాం. ఆకాష్-భైరవి జోడీ చాలా బాగా కుదిరింది. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీతో కూడిన కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం. జూన్ 12న సినిమా విడుదల కానుంది' అన్నారు.

గాయని సునీత మాట్లాడుతూ, 'ఆకాష్ ఎంతో కష్టపడే వ్యక్తి. మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఇది అతనికి రెండో సినిమా. దర్శకుడు శివ ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కథను తీసుకొచ్చారు. మైత్రి సంస్థ ఈ చిత్రానికి అండగా నిలవడం గర్వకారణం' అన్నారు.
సీనియర్ నటుడు భానుచందర్ మాట్లాడుతూ, 'ట్రైలర్ చాలా బాగుంది. హీరో, హీరోయిన్ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ఈ చిన్న సినిమాను ప్రేక్షకులు పెద్ద విజయంగా నిలబెట్టాలి' అన్నారు.
నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ, 'ఇది నాకు తొలి సినిమా. మా దర్శకుడికి తొలి చిత్రం. హీరోయిన్ కు తొలి సినిమా. హీరో ఆకాష్‌కు రెండో సినిమా. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి' అని తెలిపారు.
హీరో ఆకాష్ మాట్లాడుతూ, 'ఈ చిత్రానికి మంచి కథ అందించిన దర్శకుడికి కృతజ్ఞతలు. మైత్రి మూవీస్ వంటి సంస్థ మద్దతు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. మా అమ్మ సునీతతో పాటు చిత్ర యూనిట్ అందరికీ ధన్యవాదాలు' అన్నారు.
హీరోయిన్ భైరవి ఆర్థ్యా మాట్లాడుతూ, 'నా కెరీర్‌లో 'కొత్త మలుపు' చాలా ప్రత్యేకమైన చిత్రం.
నిర్మాత సీ కళ్యాణ్ మాట్లాడుతూ, 'సునీత మా కుటుంబ సభ్యురాలిలాంటివారు. ఆమె కుమారుడు హీరోగా నటించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను. మైత్రి మూవీస్ విడుదల చేయడం ఈ సినిమాకు మరో బలం' అన్నారు.
నటుడు రఘుబాబు మాట్లాడుతూ, 'మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారంటే సినిమా స్థాయి అర్థమవుతుంది. ఆకాష్‌కు మంచి భవిష్యత్ ఉంది. చిత్ర యూనిట్ అందరికీ శుభాకాంక్షలు' అన్నారు.
'కొత్త మలుపు' కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా భావోద్వేగాలు, ఉత్కంఠ, హాస్యం, కుటుంబ ప్రేక్షకులను అలరించే అంశాలతో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందిందని చిత్రయూనిట్ సభ్యులు తెలిపారు.
నటీనటులు:
తారాగణం ఆకాష్ గోపరాజు: హీరో (ప్రసిద్ధ నేపథ్య గాయని సునీత కుమారుడు)
భైరవి అర్ధ: హీరోయిన్
రఘుబాబు: సపోర్టింగ్ రోల్
పృధ్వీ రాజ్: సపోర్టింగ్ రోల్
ప్రభావతి: సపోర్టింగ్ రోల్
మహేందర్: సపోర్టింగ్ రోల్
డిడి శ్రీనివాస్: సపోర్టింగ్ రోల్
కిట్టయ్య: సపోర్టింగ్ రోల్
తెరవెనుక సిబ్బంది
దర్శకుడు: శివ వరప్రసాద్ కేశనకుర్తి
నిర్మాత: తాటి బాలకృష్ణ
ప్రొడక్షన్ బ్యానర్: తధాస్తు క్రియేషన్స్
సంగీత దర్శకుడు: యశ్వంత్ నాగ్
సినిమాటోగ్రాఫర్‌లు: సుమంత్ కాచర్ల & జవహర్ రెడ్డి
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar