Dailyhunt
కాజల్ ని చూసారా... ఆగకుండా డిప్స్‌ తీస్తుంది.

కాజల్ ని చూసారా... ఆగకుండా డిప్స్‌ తీస్తుంది.

మొన్న సమంత, నిన్న రకుల్... నేడు కాజల్. ఏంటా అంటుకుంటున్నారా? జిమ్ లో కసరత్తులు చేస్తూ అభిమానులకు అందంతో పాటు ఫిట్ నెస్ తో అలరిస్తున్నారు. నటనతో సినిమాల్లో ఆకట్టుకోవడంతో పాటు... సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరవడం కూడా స్టార్ ఇమేజ్ ని నిలబెట్టుకోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ఈ తరం భామలు బాగా వంట పట్టించుకున్నారు.

కథానాయకులతో పోల్చితే కథానాయికల సినీ కెరీర్‌ చాలా తక్కువగా ఉంటుంది. ఒకప్పుడు దశాబ్దంన్నర వెండితెర ప్రయాణమంటే స్టార్‌ నాయికల లెక్కలోకి వచ్చినట్లే.. కానీ, ఇప్పుడు పట్టుమని ఐదేళ్లు తెరపై నిలవగలిగిందంటే అదే గొప్ప. ఇక ఎప్పటికప్పుడు కొత్త ముద్దుగుమ్మలు తెరపై సందడి చేస్తున్న ఈరోజుల్లో వాళ్లకు ఎదురు నిలిచి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే అగ్ర కథానాయికలు మరింత ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది.

ఎప్పుటికప్పుడు తమ సొగసులను వెండితెరపై సరికొత్తగా వడ్డిస్తూనే తమ అందాలను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. తెర మీద లేత చికురుటాకుల తూలే ముద్దుగుమ్మలు నిజ జీవితంలో ఎంతో కష్టపడుతూ తమ అందాలకి పదును పెడుతున్నారు. తినే ఆహరం విషయంలో కూడా ఎంతో కంట్రోల్ గా ఉంటారు. ఈ కిటుకు అందాల చందమామ కాజల్ ఎప్పుడో తెలుసుకుంది కాబట్టే సినీకెరీర్‌ మొదలై దశాబ్దంన్నర దాటుతున్నా నేటికీ కుర్ర నాయికలతో పోటీ పడుతోంది.

తాజాగా తన విజయ సూత్రానికి సంబంధించిన కొన్ని వీడియోలను చందమామ తన సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. తన అందాన్ని కాపాడుకోవడంలో ఆమె జిమ్‌లో ఎంతటి క్లిష్టమైన కసరత్తులు చేస్తున్నది శాంపిల్‌గా చూపించింది అంతే. ఈ వీడియోల్లో కాజల్‌ బరువైన డంబెల్స్‌ ఎత్తడం, పోల్‌ని పట్టుకోని పుల్‌ అప్స్‌ తీయడంతో పాటు ఆగకుండా డిప్స్‌ తీస్తూ దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోలో నెట్టింట కుర్రకారు దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ 'భారతీయుడు 2', 'ప్యారిస్‌ ప్యారిస్‌' చిత్రాలతో బిజీగా ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald