Saturday, 25 Sep, 5.12 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

సినిమా
కలెక్షన్స్ లో వకీల్ సాబ్ ని మించిపోయిన లవ్ స్టొరీ..

కరోన మొదటి వేవ్ అయిపోయాక విడుదలైన సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ ఏ సినిమాకి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ అనే చెప్తారు. ఈ సినిమా సృష్టించిన కలెక్షన్స్ అన్ని ఇన్ని కావు. కరోన కేసులు పెరుగుతున్న సమయంలోనే వకీల్ సాబ్ దాదాపుగా 130 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమాగా మారింది. అయితే ఈ సినిమాని కొట్టేది ఇక ఇప్పటిలోనే రాదు అనుకున్న సమయంలో శేఖర్ కమ్ముల లవ్ స్టొరీ ఆ కలెక్షన్స్ బీట్ చేసింది.

అది కూడా ఇక్కడ ఇండియాలో కాదు ఓవర్సీస్ లో. ఈ కరోన వలన ఓవర్సీస్ మార్కెట్ బాగా పడిపోయింది. అక్కడ సినిమాలని చూడటానికి జనలే రావట్లేదు. ఈ పరిస్థితి ని పవర్ స్టార్ మారుస్తాడు అనుకుంటే వకీల్ సాబ్ కూడ అక్కడ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఇక ఈ సినిమా పూర్తి రన్ లో 7 లక్షల డాలర్లుని పొందింది. అయితే ఈ కలెక్షన్స్ ని లవ్ స్టొరీ కొల్లగొట్టేలా కనిపిస్తుంది. లవ్ స్టొరీకి మొదటిరోజు కలెక్షన్స్ మొత్తం కలిపి దాదాపుగా 3,50,000 డాలర్లుని సంపాదించింది.అయితే వకీల్ సాబ్ మాత్రం 3 లక్షల డాలర్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ప్రస్తుతం ఈ సినిమాకి ఉన్న బజ్ చూస్తుంటే ఒక వారంలోనే వకీల్ సాబ్ ఫుల్ రన్ కలెక్షన్స్ ని కొట్టేలాగా కనిపిస్తుంది.

ఇక లవ్ స్టోరీ కలెక్షన్స్ బాగున్నప్పటికి టాక్ మాత్రం అంత గొప్పగా లేదు. సినిమాకి ఎక్కువగా డివైడ్ టాక్ బాగా నడుస్తుంది. చాలామందికి ఈ సినిమా క్లైమాక్స్ మధ్యలోనే ఆపేశారు అనే ఫీలింగ్ లో ఉన్నారు. అయితే ఈ సినిమా హిట్ అవుతుందో లేదో తెలియాలి అంటే మాత్రం సోమవారం వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది మూవీ టీం సక్సెస్ మీట్స్ కూడా మొదలుపెట్టారు.

మచిలీపట్నం ఆస్పత్రిలో ఆడశిశువు మాయం..చుట్టమని వచ్చి!

బిగ్ బాస్ - 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..?

'లవ్ స్టోరీ' తో కెరీర్లో ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టిన చైతూ..!!

హుజురాబాద్ ప్రజలకు తెలంగాణ సర్కార్ మరో కానుక !

బిగ్ బాస్ 5: "మానస్ - ప్రియాంక" మధ్యలో హమీదా ?

వెబ్ సీరీస్ భవిష్యత్తులో ఉండొచ్చు : మహేష్ బాబు

ఆయనకు గుడ్ బై చెప్పేసిన బాబు... టీడీపీలో హాట్ టాపిక్ ?

చంద్రబాబు వీళ్లను నమ్ముకుంటే 2024లోనూ నిండా మునగాల్సిందే..!

వైసీపీలో పెద్ద బాంబు పేలుతోందా...!

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top