Friday, 23 Apr, 1.09 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

రాజకీయ వార్తలు
కరోనా ఎఫెక్ట్.. సోషల్ మీడియాపైనే అభ్యర్థుల ఫోకస్‌!

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది.. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. దీంతో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. మాస్క్ ధరించనివారికి రూ.వెయ్యి ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, నైట్ కర్ఫ్యూ సైతం విధించింది. రాత్రి 8గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతించిన ప్రభుత్వం, రాత్రి 9 తరువాత రోడ్లపై ఎవరూ కనిపించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఈసీ సైతం ప్రస్తుతం జరుగుతున్న రెండు కార్పొరేషన్‌, ఐదు మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రచారానికి నిబంధనలు విధించింది. సాయంత్రం 6గంటల వరకే బహిరంగ సభలు నిర్వహించుకోవాలని, 8గంటల వరకు ప్రచారం పూర్తిచేసుకోవాలని సూచించింది. దీనికితోడు ప్రచారంలో పాల్గొనాలంటే తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశాలు ఇచ్చింది.

కరోనా చేస్తున్న విలయతాండవంతో అభ్యర్థులుసైతం బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన రాష్ట్రస్థాయి నేతల్లో పలువురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జిల్లా స్థాయిలోని పలువురు ముఖ్యనేతలుసైతం కరోనా బారిన పడ్డారు. దీంతో అధిక డివిజన్‌లు, వార్డుల్లో ఒకరిద్దరు కీలక నేతలతో కలిసి అభ్యర్థులే తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడ వైరస్ బారినపడతామనే ఆందోళన వారిని వెంటాడుతుంది. మరోవైపు రాత్రి సమయంలో 8గంటలకే ప్రచారం ముగించాలని ఈసీ ఆదేశాలు అభ్యర్థులకు ఇబ్బదికరంగా మరుతున్నాయి. దీంతో సోషల్ మీడియాపైనే అభ్యర్థులు ఆధారపడినట్లు తెలుస్తోంది.

వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌లతో పాటు ఐదు మున్సిపాలిటీల్లో సోషల్ మీడియా వేదికగా అభ్యర్థులు విస్తృత ప్రచారం సాగిస్తున్నారట. ముఖ్యంగా రాత్రి 8గంటల తరువాత నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సోషల్ మీడియాలో ఓట్లు అభ్యర్థిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. డివిజన్‌, వార్డుల్లోని ఓటర్ల నెంబర్‌లతో వాట్సప్ గ్రూపులు తయారుచేసి వాటిద్వారా తనను గెలిపిస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతాను, ఏ విధంగా డివిజన్‌, వార్డును అభివృద్ధి చేస్తాను అనే వివరాలను పోస్టులు చేస్తూ ఓటర్లను మచ్చిక చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాయిస్ మెస్సేజ్‌లతో పాటు, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాం వంటి వాటిద్వారా అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టిడిపి నేతలని టార్గెట్ చేసిన జగన్...

వైసీపీ కి భయపడి టీడీపీ మాజీ మంత్రి కాళ్ళ భేరానికి ...?

వివేక్ మృతితో మళ్ళీ చిక్కుల్లోకి శంకర్

కని కరోనా :టెస్టులు పెంచేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ట్రిపుల్ ఆర్ కి ముందు కోలీవుడ్ కో చరణ్ మాస్టర్ ప్లాన్...?

కని కరోనా : టెస్టుల ఫలితాలు వచ్చే వరకు ఆగొద్దంటున్న ఈటల

కని కరోనా : కరోనా ముందు అవేమీ పనిచేయడంలేదు...?

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top