ఎదిగే పిల్లలపై ప్రమాద ఘటింకలు
కరోనా కారణంగా ఆరోగ్య సమస్యలు
ఊహించని రీతిలో స్థూల కాయం
ఆట పాటల్లేని కారణంగా తీవ్ర స్థాయిలో ప్రమాదం
ఐదారేళ్ల చిన్నారుల్లారా నను చూస్తే మీకు నవ్వొస్తుందా..
ఊబకాయ సమస్యతో వీళ్లంతా అవస్థలు పడుతు న్నారు. బడులు లేని కారణంగా ఆటల్లేవు. ఇంట్లో ఉన్నా సరైన గైడెన్స్ వారికి లేదు. కూర్చొని వినే చదువు కొంత సేపే తరువాత వీడియో గేమ్ ప్రపంచంలోకి పోతున్నారు. ఇవన్నీ ఆందోళన దాయకాలే. ఆటల్లేకుండా వికాసం లేదు. అపార్టుమెంట్లలో ఆటలా కుదరని పని. ఇరుకిరుకు గదుల్లో ఆటలా కుదరని పని. కరోనా కారణంగా పిల్లలు స్థూలకాయులు అయిపోయారు. పదకొండేళ్ల లోపు పిల్లలకే ఈ సమస్య ఎక్కువగా ఉందని అధ్యయనాలు తేల్చాయి. తల్లిదండ్రుల ఆందోళనకు ఇప్పుడు పరిష్కారం ఏంటంటే వాళ్లతో వ్యాయామం చేయించడమే అని నిపుణులు చెబుతున్నారు.
కరోనా కారణంగా రెండేళ్లుగా చదువులు లేవు. బడులు లేవు. ఆన్ లైన్ చదువులు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. సరైన సమయం లో పిల్లలకు సరైన వ్యాయమమే లేదు. ఈ దశలో పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు. బడికి వెళ్లే దశలో ఇంటికి పరిమితం కావడం, వేళ కాని వేళల్లో ఆహారం తీసుకోవడం ఇలాంటివన్నీ పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ఏం చేయాలో పాలుపోక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కొందరిలో మానసికంగా కుంగుబాటు కూడా మొదలయిపోతోంది. వీటితో పాటు తోటి పిల్లల అవహేళనలూ అలానే ఉన్నాయి. ఇలాంటి దశలో పిల్లలను మరింతగా భయాల నుంచి బయటకు తీసుకురావా ల్సింది, నాలుగు మంచి మాటలు చెప్పి ఆందోళనలు పోగొట్టాల్సింది తల్లిదండ్రులే అన్నది సుస్పష్టం. నగరాల్లోనే కాదు మామూలు పట్టణాల్లోనూ ఇదే సమస్య ఉందని గుర్తించారు వైద్యులు. సరిగా గాలి, వెలుతురు లేని గదుల్లో పిల్లలను ఉంచడం, పాఠాలు చెప్ప డం కూడా తగదని, అదేవిధంగా తప్పనిసరిగా స్కూల్స్ లో గేమ్స్ పిరియడ్ ను ఇంప్లిమెంట్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
దశాబ్దాల హీరోస్వామ్యానికి చెక్ పెట్టిన జగన్ ...!
నువ్వొక కిడ్, సొంత పార్టీ ఎమ్మెల్యేపై మార్గాని భరత్ ఫైర్...?
పీకే టీంతో పీకేదేం లేదా... వైసీపీలో రుసరుసలు...!
ఫేస్ బుక్ .. డైరెక్టర్ గా మాజీ ఐఏఎస్ ..
తెలంగాణ వార్త : చాంద్రాయణ గుట్టలో కలకలం
మళ్ళీ ఏపీకి .. ప్రశాంత్ కిషోర్ ..
టీడీపీలో బీకాంలో ఫిజిక్స్ కొత్త రచ్చ...!
జెడ్పీ బైట్ : శ్రీకాకుళంలో జగన్ పై తిరుగుబాటు!
రాజ్ కుంద్రా కేసులో షాక్.. వాళ్ళందరి మీద లుకౌట్ నోటీసులు!
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE

