Saturday, 25 Sep, 5.51 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
ఖబర్దార్.. ప్రళయం సృష్టిస్తాం !

టిఆర్ఎస్ సర్కార్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి కామెంట్స్ చేశాడు. ఇక్కడ ధర్మానికి, న్యాయానికి స్థానం ఉంటుందని.. మేం ప్రశాంతంగా ఉంటాం.. మా జోలికి వస్తె ఊరుకోమని హెచ్చరించారు ఈటల. దౌర్జన్యం జరిగితే ముందుగా చిందవలసింది తన రక్తపు బొట్టేనని.. కేసులు పెడితే, జైళ్లో పెడితే ముందు తనను పెట్టాలని సవాల్ విసిరారు. ఏమీ చెయ్యక పోతే 6 సార్లు ఎలా తనను గెలిపించారని.. ఎం చేతకాని వాడిని అంటావా? నా జోలికి రాకండని హెచ్చరించారు. ప్రజల గుండెల్లో ఉన్న నా ముద్ర.. సారాకు, డబ్బుకు చేదిరిపొదన్నారు.

సముద్రం నిచ్చలం గా ఉంటుందని.. తుఫాను వస్తె దాని ఉదృతం తెలుస్తుందన్నారు. ప్రళయం సృష్టిస్తం ఖబర్దార్ అంటూ ఈటల వార్నింగ్ ఇచ్చారు. తన కొట్లాట నీలాంటి బానిసల మీద కాదని.. కెసిఆర్ మీద తన కొట్లాట అని స్పష్టం చేశారు ఈటల. కెసిఆర్ డబ్బు సంచులకు.. ధర్మానికి మధ్య ఎన్నిక అని..తెలిపారు. రెండు గుంటలు వాడు 250 కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నాడని.. ఇదంతా నీ అక్రమ సొమ్ము కాదా ? అని కెసిఆర్ పై ఫైర్ అయ్యారు. డప్పులు కొట్టడానికి రాకుండా అడ్డుకున్నారట.. దళిత బంధు డబ్బు మా ప్రజలు కష్ట పడ్డ డబ్బు అని తెలిపారు.

డబ్బులు, మద్యం, నాయకులను పక్కన పెట్టు సిఎం కెసిఆర్ పోటీ చేయాలని..డిమాండ్ చేశారు. వినోద్ కుమార్ కి ఎక్కడ ఓట్లు రాకపోయినా హుజూరాబాద్ లో 57 వేల మెజారిటీ ఇచ్చానని... అయన కూడా నన్ను రాజీనామా చేయమన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేసి మీ ముందుకు వచ్చానని ఇప్పుడు మీరే కాపాడుకోవాలని ప్రజలను కోరారు ఈటల రాజేందర్. తాను గెలిస్తే తెలంగాణ గెలిచినట్లు అని పేర్కొన్నారు. తన రాజీనామా తో హుజూరాబాద్ నియోజక వర్గానికి చాలా వచ్చాయని... మీరందరూ తన ఫోటో పెట్టుకోవాలన్నారు ఈటల రాజేందర్. ఇంకా.... ఎవరి జాగాలో వారికి ఇళ్లు, ఉద్యోగం, నిరుద్యోగ భృతి, 57 ఏళ్లకే పెన్షన్, రైతులకు రుణ మాఫీ, గౌడ లకు మోపెడ్స్ ఇవ్వన్నీ టిఆర్ఎస్ సర్కార్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బిగ్ బాస్ - 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..?

'లవ్ స్టోరీ' తో కెరీర్లో ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టిన చైతూ..!!

హుజురాబాద్ ప్రజలకు తెలంగాణ సర్కార్ మరో కానుక !

బిగ్ బాస్ 5: "మానస్ - ప్రియాంక" మధ్యలో హమీదా ?

వెబ్ సీరీస్ భవిష్యత్తులో ఉండొచ్చు : మహేష్ బాబు

ఆయనకు గుడ్ బై చెప్పేసిన బాబు... టీడీపీలో హాట్ టాపిక్ ?

చంద్రబాబు వీళ్లను నమ్ముకుంటే 2024లోనూ నిండా మునగాల్సిందే..!

వైసీపీలో పెద్ద బాంబు పేలుతోందా...!

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top