Dailyhunt
కొరటాల సినిమాలో చిరంజీవితో జెనీలియా..?

కొరటాల సినిమాలో చిరంజీవితో జెనీలియా..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జనవరి నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలు పెట్టిన సినిమా యూనిట్ ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులలో ఫుల్ బిజీగా ఉంది. ఇటువంటి నేపథ్యంలో సినిమాలో చిరంజీవి డబల్ రోల్ క్యారెక్టర్ చేస్తున్నట్లు వార్తలు రావడంతో హీరోయిన్ గా త్రిష ఇప్పటికే ఎంపికైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా జెనీలియా కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.

డబుల్ రోల్ పాత్రలో చిరంజీవి నటించిన నేపథ్యంలో ఇద్దరు హీరోయిన్లు సినిమాకి కావల్సిన నేపథ్యంలో ఇప్పటికే త్రిష ఎంపికతో పాటు జెనీలియా కూడా సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నట్లు సమాచారం.

ముఖ్యంగా ఈ సినిమాకి చరణ్ ప్రొడ్యూసర్ కావటంతో అప్పట్లో రామ్ చరణ్ పక్కన ఆరంజ్ సినిమాలో నటించిన చనువుతో జెనీలియా ని ఈ సినిమాలో నటింపజేయడానికి ఓకే చేయించినట్లు వార్తలు వినబడుతున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే చాలా కాలం తర్వాత మళ్లీ పెళ్లి అయిన తర్వాత జెనీలియా సౌత్ సినిమాల్లో నటిస్తానని భజన కచ్చితంగా బొమ్మరిల్లు హాసిని అభిమానులకు నిజమైన పండుగ న్యూసే అని చెప్పవచ్చు.

ఈ సినిమాతో జెనీలియా సౌత్ లో రీ ఎంట్రీ ఇచ్చినట్లే అని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం చిరంజీవి ఈ సినిమా కోసం బరువు తగ్గే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే సైరా సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాలు టైం కేటాయించిన చిరంజీవి కొరటాల సినిమా కొద్ది నెలలలోనే కంప్లీట్ చేయడానికి పక్కా ప్లానింగ్ షెడ్యూల్ చేయాలని తనయుడు నిర్మాత చెర్రీకి ఆదేశాలు ఇవ్వడంతో ...జనవరిలో సినిమా మొదలు పెట్టి వచ్చే సమ్మర్ కె విడుదల చేయాలని భావిస్తున్నారట సినిమా యూనిట్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald