Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్రిష్ పై ఆధారపడిపోయిన దిల్ రాజ్ !

క్రిష్ పై ఆధారపడిపోయిన దిల్ రాజ్ !

'వకీల్ సాబ్' ప్రాజెక్ట్ మొదలు పెట్టిన దగ్గర నుండి దిల్ రాజ్ కు సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వాస్తవానికి పవన్ రాజకీయాలు 'వకీల్ సాబ్' కు అడ్డుపడతాయి అంటూ దిల్ రాజ్ భయపడ్డాడు. అయితే జరిగిన వాస్తవం వేరు ఇప్పుడు 'వకీల్ సాబ్' కు అడ్డుపడుతున్నది కరోనా.



తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ షూటింగ్ ఇప్పటికే సగం పైగా పూర్తి అయిన పరిస్థితులలో ఈమూవీకి సంబంధించిన కీలక షెడ్యూల్ ఈనెల 20 నుండి నెలాఖరి వరకు జరగవలసి ఉంది. ఇప్పుడు షూటింగ్స్ పై బ్యాన్ కొనసాగుతున్న పరిస్థితులలో వచ్చేనెల అయినా ఈమూవీకి సంబంధించిన ఈకీలక షెడ్యూల్ పూర్తి చేయకపోతే మేలో ఈమూవీ విడుదలచేయడం అసాధ్యం.

వచ్చేనెలకు సంబంధించిన డేట్స్ అన్నీ ఇప్పుడు క్రిష్ తీస్తున్న సినిమా కోసం పవన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో అనుకున్న విధంగా 'వకీల్ సాబ్' పూర్తి అయి విడుదల అవ్వాలి అంటే వచ్చేనెల క్రిష్ మూవీకి సంబంధించిన డేట్స్ ఇప్పుడు ఆమూవీ నిర్మాత ఎ.ఎమ్. రత్నం దిల్ రాజ్ కు సద్దుబాటు చేయవలసి వస్తోంది. అయితే క్రిష్ పవన్ మూవీని భారీ బడ్జెట్ తో తీస్తున్న నేపధ్యంలో అనేకమంది ప్రముఖ నటీనటులు ఈమూవీలో నటిస్తున్నారు.

ఇప్పుడు దిల్ రాజ్ ఒత్తిడికి ఒప్పుకుని క్రిష్ పవన్ డేట్స్ ను సద్దుబాటు చేస్తే ఈ మూవీకి సంబంధించిన కీలక షెడ్యూల్ మిస్ అవుతుంది అన్నఅభిప్రాయం క్రిష్ లో కొనసాగుతున్నట్లు టాక్. ఇలాంటి పరిస్థితులలో పవన్ ఖాళీగా ఉన్నా అతడి డేట్స్ ను ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నందుకు దిల్ రాజ్ బాధపడుతున్నట్లు టాక్. ఇప్పటికే 'జాను' మూవీతో నష్టాలు కొనితెచ్చుకున్న దిల్ రాజ్ ఆ నష్టాలను 'వి' మూవీతో సరిపెట్టుకోవాలని ప్రయత్నించాడు. ఇప్పుడు కరోనా దెబ్బతో ఈమూవీ కూడ వాయిదా పడటంతో పాటు ఇప్పుడు వకీల్ సాబ్ ప్రాజెక్ట్ కూడ పెండింగ్ లో పడటంతో దిల్ రాజ్ కు భారీస్థాయిలో డబ్బు బ్లాక్ అయింది అంటూ వార్తలు హడావిడి చేస్తున్నాయి..



జగన్ కు ఒక షాకైతే నిమ్మగడ్డకు మూడు షాకులిచ్చిన సుప్రింకోర్టు .. ఏమిటో తెలుసా ?

పాపం టీడీపీ త్రిమూర్తుల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు... !

బిగ్ బ్రేకింగ్‌: నాలుగు రోజులు బ్యాంకుల మూత.... ఎలెర్ట్ కాకపోతే అంతే..!

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald