Wednesday, 25 Nov, 7.00 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
కృష్ణా జిల్లాలో భారీ దొంగతనం.. రూ. కోటి విలువైన సొత్తు మాయం..!

పెళ్లికి వెళ్లిన ఓ మహిళ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇదే మంచి సమయం అనుకుని రెచ్చిపోయారు.అందినకాడికి దోచుకెళ్లారు. పోయిన సొత్తు విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని బాధితురాలు లబోదిబోమంటుంది. ఈ ఘటన కృష్ణ జిల్లాలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. వివాహానికి వెళ్లిన ఓ మహిళ ఇంట్లో చొరబడి భారీగా బంగారం, నగదు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. వీటి విలువ దాదాపు రూ. కోటి వరకు ఉంటుందని బాధితురాలు తెలుపుతోంది. కృష్ణాజిల్లాలోని పమిడిముక్కల మండలం గురజాకుడు చెందిన రాజేశ్వరీ అనే మహిళ ఇంట్లో దొంగలు చొరబడ్డారు. ఈమె హైదరాబాద్ లోని తన సోదరుడి ఇంట్లో శుభకార్యం నిమిత్తం ఈ నెల19న వెళ్లింది..ఈ నెల 23న వచ్చే చూసే సరికి ఇళ్లంతా చిందరవందర..ఎక్కడి సామన్లు అక్కడ పడేసున్నాయి. బీరువాలోని వెండి, బంగారం, నగదు అంతా చోరికి గురైనట్లు బాధితురాలు పేర్కంది. లబోదిబో మంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

బాధితురాలు ఫిర్యాదు మేరకు.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఉయ్యూరు సీఐ నాగప్రసాద్ తన సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. క్లూస్ టీం ఆధారంగా వేలి ముద్రలు సేకరించారు. నేరస్థులను పట్టుకునేందురు మూడు బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చోరీకి గురైన బంగారు ఆభరణాలు ఒక కేజీ కి పైగా ఉండవచ్చని, వెండి వస్తువులు 10 కేజీలు ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. చోరీకి గురైన మొత్తం సోత్తు విలువ సుమారు రూ. కోటి రూపాయల వరకు ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు.

ఈ భారీ దొంగతనంతో స్థానికులు భయబ్రాంతులకు గురవతున్నారు. చోరీకి పాల్పడిన వారిని వెంటనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.. అసలే బంగారం రేటు రోజురోజుకు పెరిగిపోతుంది..ఈ సమయంలో ఇంత మొత్తంలో నగదు చోరీకి గురవడంటో బాధిత మహిళ విలపిస్తోంది. నేరస్థులను త్వరితగతిన పట్టుకుని తన సొమ్ము తిరిగి ఇప్పించాలని పోలీసులును కోరింది.

రానా సమస్యలతో ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ !

గ్రేటర్ ఎన్నికల్లో అమరావతి రాజధాని హైలెట్?

గ్రేటర్ యుద్దం : దమ్ముంటే సర్జికల్ స్టైక్స్ అక్కడ చేయండి..మండిపడ్డ అసరుద్దీన్..!!

ఆరోగ్య శాఖపై జగన్ కీలక నిర్ణయం

బెట్టింగ్ డబ్బుల కక్కుర్తితో బంగారం లాంటి ఉద్యోగం పోగొట్టుకున్నాడు

మహిళ పై అత్యాచారం చేస్తే.. నపుంసకులుగా మార్చేస్తారు..?

కలెక్టర్ కి జగన్ ఫోన్

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top