Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కుర్రకారు మతి పోగొడుతున్న బైక్.. ధర ఎంతో తెలుసా...!!

కుర్రకారు మతి పోగొడుతున్న బైక్.. ధర ఎంతో తెలుసా...!!

యువత ఎక్కువగా బైక్ లను కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ముఖ్యంగా ఫీచర్స్ ఎక్కువగా ఉన్న వాటికి ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు.అయితే ఇప్పుడు మాత్రం ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిమాండ్ మాత్రం భారీగా పెరుగుతున్నాయి. అందుకే వీటికి ప్రస్తుతం డిమాండ్ కూడా ఎక్కువే ఉంటుంది. తాజాగా ఈ సంస్థ తన గ్రేజియా మోడల్లో సరికొత్త ఎడిషన్ ను భారత విపణిలో లాంచ్ చేసింది. అదే ఎంతో పాపులరైన హోండా గ్రేజియా 125 స్పోర్ట్స్ఎడిషన్. ఎక్స్ షోరూంలో ఈ స్కూటర్ ప్రారంభ ధర వచ్చేసి రూ.82,546లుగా సంస్థ వెల్లడించింది..

2021 హోండా గ్రేజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్ 124 సీసీ సింగిల్ సిలీండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంది.

ఇది 6000 ఆర్పీఎం వద్ద 8.14 బీహెచ్ బ్రేక్ హార్స్ పవర్, 5000 ఆర్పీఎం వద్ద 10.3 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకకాుండా సీవీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఎడిషన్ మోడల్లో రెండు కొత్త పెయింట్ స్కీమ్స్ తో పాటు ఫ్రెష్ బాడీ గ్రాఫిక్స్ ఉన్నాయి. పెరల్ నైట్ స్టార్ బ్లాక్, స్పోర్ట్స్ రెడ్ కలర్లో ఇది లభ్యమవుతుంది.

ఈ ఫీచర్ల విషయానికొస్తే..అన్నీ రకాల పనులకు ఉపయోగించుకోవచ్చు..మల్టీఫంక్షన్ ఇగ్నేషన్ స్విచ్, ఫుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్, అల్లాయ్ వీల్స్, ఎక్సటర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టం లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. అర్బన్ ప్రాంతాల్లో ఈ స్కూటర్ అత్యుుత్తమంగా పనికొస్తుందని, ముఖ్యంగా కుర్రకారుకు బాగా ఆకట్టుకుంటుందని అంటున్నారు.. హోండా సేల్స్ మార్కెటింగ్ డైరెక్టర్ యద్వీందర్ సింగ్ గులేరియా అన్నారు. భారత మార్కెట్లో ఈ సరికొత్త హోండా గ్రేజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్ కు పోటీగా టీవీఎస్ ఎన్ టార్క్ 125 రేస్ ఎడిషన్, సుజుకీ బర్గ్ మన్ స్ట్రీట్ 125 లాంటి స్కూటర్లు ఉన్నాయి.. ఇప్పుడు యువత ఈ స్కూటర్ ను కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో మార్కెట్ లో ఈ స్కూటర్ కు డిమాండ్ భారీగా పెరిగింది.



సీటీమార్ రిలీజ్ అప్పుడే.. గోపీచంద్ ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యాడంటే..!

షర్మిల కొత్త పార్టీ... మాజీ మంత్రి ఏమన్నారు...?

షర్మిల కొత్త పార్టీపై కోదండరాం సంచలన వ్యాఖ్యలు

టీడీపీ కోసం బాబు అతి పెద్ద సాహసం...?

బ్రాహ్మణ ఘోష: జగనోరు.. అయ్యోర్లను వాడుకుని వదిలేశారా..?

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేదన: కలిసిరాని మంత్రులు.. సమస్యల పరిష్కారం ఎలా ?

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald