Thursday, 21 Jan, 9.00 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
'మాల్దీవ్స్ బీచ్' లో ఎంజాయ్ చేస్తన్న సీనియర్ సినీ జంట..ఈ వయసులో కూడానా..??

ఎందుకో తెలియదు కానీ.. మన టాలీవుడ్ సినీ నటులందరూ సరదాగా గడపడానికి మాళ్దివులనే ఎంచుకుంటున్నారు.. మాల్దీవులు సెలబ్రిటీలకు బాగా ఇష్టమైన ప్రదేశంగా పాపులర్ అయింది.ఇప్పటికే చాలామంది సెలెబ్రెటీలు ఈ అందమైన ప్రదేశంలో సేద తీరుతూ.. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలలో పోస్ట్ చేస్తూ.. తమ అభిమానులతో పంచుకున్నారు..ఇలా ప్రతిసారీ చాలామంది సెలబ్రిటీ జంటలు ఈ అందమైన ద్వీపానికి చేరుకొని బీచ్లో సాయంత్రవేళ సన్ సెట్ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక కపుల్ పిక్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఎందుకంటే ఈ జంట ఎప్పుడు కూడా అలా హాలిడేకు మాల్దీవ్స్ లాంటి ప్రదేశానికి వెళ్లిన దాఖలాలు కనిపించడంలేదు.

ఆ సెలబ్రిటీ కపుల్ ఎవరో కాదు టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆయన సతీమణి నిర్మల.మోహన్ బాబు సాధారణంగా ఖాళీ సమయం దొరికితే తిరుపతికి వెళ్లి అక్కడే సేదతీరుతూ.. విలువైన సమయాన్ని గడిపివస్తాడు. కానీ ఈసారి ఆయన సేదతీరడానికి తన భార్యను వెంటేసుకొని ఏకంగా దేశం దాటి వెళ్లాడని అంతా ఆశ్చర్యపోతున్నారు.అయితే ట్రిప్ కేవలం మోహన్ బాబు దంపతులకు మాత్రమే కాదు. వారితో పాటు కూతురు లక్ష్మీప్రసన్న అల్లుడు శ్రీనివాసన్ మనవరాలు విద్య నిర్వాణ కూడా ఉన్నారట. ఇదివరకు మంచు లక్ష్మి.. తన తల్లిదండ్రుల ఒడిలో కూర్చుని ఉన్న పిక్ షేర్ చేసి ట్రీట్ ఇచ్చింది.

అందులో కూడా సూర్యాస్తమయం నేపథ్యంలో దిగినట్లు కనిపిస్తుంది. ఫోటోలో ఎలాంటి ఫిల్టర్ లేదని చెప్పుకొచ్చింది. అలాగే ఈ ఫోటోను మోహన్ బాబు అల్లుడు ఆండిశ్రీనివాసన్ తీశాడంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది లక్ష్మిమంచు. అయితే తాజాగా షేర్ చేసిన ఫోటోలో మోహన్ బాబు ఆయన భార్య నిర్మలతో ఇసుక తిన్నెలపై కూర్చొని సూర్యాస్తమయం వేళలో సేదతీరున్నారు. ఇక మోహన్ బాబు చొక్కా షార్ట్ ధరించగా ఆయన భార్య పంజాబీ డ్రెస్ ధరించి భర్త భుజాలపై వాలింది..ప్రస్తుతం వీరి ఫోటో నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది...!!

" style="height: 628px;">



బ్రాహ్మణ ఘోష: జగన్ పాలనలో అర్చకులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!

బ్రాహ్మణ ఘోష: వైసీపీలో బ్రాహ్మణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

రాధే శ్యామ్ పరమహంస సీక్రెట్ బయటపెట్టిన కృష్ణంరాజు !

బ్రాహ్మణ ఘోష: బ్రాహ్మణ యువత జాగృతం కావాలి.. రాజకీయాలకు చేరువ అవ్వాలి..!

హెరాల్డ్ సెటైర్ : రాజకీయ యాత్రలతో రచ్చ చేస్తున్న ప్రతిపక్షాలు

ఆర్థిక కష్టం.. టిడిపికి ఎంతో నష్టం ?

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top