Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మామయ్యకు జై అంటున్న ఎన్టీయార్ మనవడు...!?

మామయ్యకు జై అంటున్న ఎన్టీయార్ మనవడు...!?

నందమూరి కుటుంబం నారా కుటుంబంగా తెలుగుదేశంలో రాజకీయ యుధ్ధం ఎంతో కాలంగా సాగుతోంది. ఇక తాజాగా చంద్రబాబును అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చాలా దారుణంగా విమర్శించారు. చంద్రబాబు అన్న ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచారని కూడా గతాన్ని తవ్వారు. లోకేష్ కి పార్టీ నాయకత్వం అప్పగిస్తే టీడీపీ నావ మునిగిపోవడం ఖాయమని కూడా అన్నారు. మరో వైపు మంత్రి కోడాలి నాని సైతం చంద్రబాబు పై ఘాటైన పదజాలంతో విమర్శలు చేశారు.

ఇవన్నీ ఇలా ఉంటే చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేష్ కి మద్దతుగా బయటకు వచ్చి ఒక్కరు కూడా పెద్దగా మద్దతు ఇవ్వలేదు. అయితే ఇపుడు నందమూరి కుటుంబం నుంచే బాబుకు అనూహ్య మద్దతు లభించడం విశేషం. మా మామయ్యని ఏమైనా అంటే వూరుకోను అంటున్నారు.

ఎన్టీయార్ మనవడు చైతన్యక్రిష్ణ. ఈయన ఎవరో కాదు. ఎన్టీయార్ పెద్ద కుమారుడు జయక్రిష్ణ కుమారుడు. మా మామయ్యని అంతలేసి మాటలంటారా అంటూ వంశీ, నానిలపై మండిపడుతున్నారు.

ఈ మేరకు వీడియో ఒకటి విడుదల చేసి మరీ చైతన్య క్రిష్ణ మామ మీద తన అభిమానాన్ని చూపించుకున్నారు. మా మామయ్య లేకపోతే మీకు టికెట్ దక్కుతుందా, గెలిచేవారేనా అంటూ గట్టిగానే తగులుకున్నాడు. మరి అన్న గారి కుటుంబం నుంచి బాబుకు ఈ సమయంలో మద్దతు దక్కడం విశేషమే. పైగా ఎన్టీయార్ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని అంతా అంటూంటే పెద్ద మనవడు మాత్రం జై చంద్రబాబు అనడం రాజకీయ విచిత్రమే. మరి రేపటి రోజున చైతన్య క్రిష్ణ బాబు వెనకలా నిలబడి టీడీపీకి కొమ్ము కాస్తాడేమో చూడాలి.

ఇప్పటికే జూనియర్ ఎన్టీయార్ ని వద్దు అంటున్న టీడీపీకి కొత్త ఆకర్షణగా మారాలని చైతన్య క్రిష్ణ అనుకుంటున్నాడేమో చూడాలి. మరో వైపు సినిమా రంగంలో కూడా తన సత్తా చాటాలని కూడా చైతన్య క్రిష్ణ అనుకుంటున్నాడుట.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald