Thursday, 21 Jan, 11.45 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
మాస్ మహారాజ తో మాస్ కమర్షియల్ డైరెక్టర్ మూవీ ఫిక్స్ అయిందా......??

మహారాజా రవితేజ హీరోగా ప్రస్తుతం తెరకెక్కిన క్రాక్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ దిశగా భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మంచి మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా ఎస్ తమన్ మ్యూజిక్ ని జీకే విష్ణు ఫోటోగ్రఫీ అందించారు. సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన ఈ సినిమాలో కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ ఇద్దరూ కూడా నెగిటివ్ పాత్రల్లో నటించి ప్రేక్షకాభిమానుల నుంచి మంచి పేరు దక్కించుకున్నారు.
కొన్నాళ్ల నుంచి కెరియర్ పరంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న మాస్ రాజా రవితేజకి ఒక్కసారిగా ఈ క్రాక్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అతి పెద్ద బ్రేక్ నిచ్చింది అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమాలో రవితేజ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత రవితేజ నటించబోయే మరొక సినిమా కూడా ఖరారైనట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. గబ్బర్ సింగ్, డిజె, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేష్ వంటి పవర్ ఫుల్ సినిమాలతో అత్యద్భుతమైన విజయాలు అందుకున్న హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయనున్నారని టాక్.

కొద్ది రోజుల క్రితం అదిరిపోయే మంచి మాస్ స్టోరీని రవితేజకు వినిపించిన హరీష్ శంకర్ అది ఆయనకు ఎంతో నచ్చడంతో ఏడాది ద్వితీయార్థంలో దానిని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అతి త్వరలో పవర్ స్టార్ తో ఒక సినిమా చేయనున్న హరీష్ శంకర్ దాని అనంతరం రవితేజతో సినిమా షురూ చేయనున్నారని అంటున్నారు. ఇక గతంలో రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన మిరపకాయ్ మూవీ సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారిక న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు......!!

బ్రాహ్మణ ఘోష: జగన్ పాలనలో అర్చకులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!

బ్రాహ్మణ ఘోష: వైసీపీలో బ్రాహ్మణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

రాధే శ్యామ్ పరమహంస సీక్రెట్ బయటపెట్టిన కృష్ణంరాజు !

బ్రాహ్మణ ఘోష: బ్రాహ్మణ యువత జాగృతం కావాలి.. రాజకీయాలకు చేరువ అవ్వాలి..!

హెరాల్డ్ సెటైర్ : రాజకీయ యాత్రలతో రచ్చ చేస్తున్న ప్రతిపక్షాలు

ఆర్థిక కష్టం.. టిడిపికి ఎంతో నష్టం ?

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top