Thursday, 04 Mar, 9.11 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

రాజకీయ వార్తలు
మహారాష్ట్ర, కేరళలో ఓ రేంజ్‌లో విజృంభిస్తున్న కరోనా...

దేశంలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తోంది. అయితే అన్ని రాష్ట్రాల్లో ప్రమాద స్థాయిలో లేకపోయిన దాదాపు ఆరు రాష్ట్రాలను మాత్రం గడగడ వణికిస్తోంది. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలిరా దేవుడా...! అనుకుంటూ అక్కడి ప్రభుత్వాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనిచేస్తున్నాయి. టీకా వేయించుకున్న వారికి సైతం కరోనా వస్తుండటం కొత్త విషయంగా చెప్పుకోవాలి. టీకా పనితీరుపై కూడా అనుమానాలు నెలకొంటున్నాయి. దేశంలోకి కరోనా అడుగుపెట్టిన తొలినాళ్లలో కేసులతో అల్లాడిపోయిన కేరళలో మహమ్మారి మరోమారు విజృంభిస్తోంది. ఇటీవల పూర్తిగా నెమ్మదించినట్టు కనిపించిన ఈ ప్రాణాంతక వైరస్ మరోమారు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఇదిలా ఉండగా దేశంలోని రెండు రాష్ట్రాల్లో కరోనా కేసులు మరింతగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో కొత్తగా 9,855 కరోనా కేసులు నమోదు కాగా, కేరళలో ఇదే సమయంలో కొత్తగా 2,700 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 60 నుంచి 70 శాతం కరోనా కేసులు ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కొన్ని జిల్లాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ విధించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైని కరోనా మరోమారు వణికిస్తోంది. ఈ నేపధ్యంలో మహానగరంలో మాస్క్ పెట్టుకోని వారిపై చర్యలు తీసుకోనున్నట్లు ముంబై పోలీసు కమిషనర్ పరమవీర్ సింగ్ హెచ్చరించారు.

ఇదిలా ఉండగా కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే వ్యాక్సిన్ పంపిణీలోనూ వేగం పెంచింది. ఇందులో భాగంగానే ఇకపై 24 గంటలూ ప్రజలకు కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచుతామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి వెల్లడించారు. ప్రజలు వారికి అనుకూలమైన సమయాల్లో వచ్చి వ్యాక్సిన్‌ తీసుకునేందు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. అన్ని ఆస్పత్రుల్లో టీకా వేయడానికి ఉన్న సమయ పరిమితిని ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్థన్‌ తెలిపారు.

ఏపీలో ఆ నలుగురు మంత్రులదే రాజ్యం... బాలయ్య సంచలన వ్యాఖ్యలు

వైరల్ :కేవలం 20 చెట్లతో 36 లక్షలు సంపాదన..?

అప్పులకుప్ప ఆంద్రప్రదేశ్ - ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరం

కరోనాతో గుండెజబ్బులు... కొత్త విషయం వెలుగులోకి..

పురపోరు: మనసు మార్చుకున్న తెలుగుదేశం.. ఢీ అంటే ఢీ

పుర పోరు: పశ్చిమలో ఆ ఒక్క మహిళతో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పురపోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జన్యాలు.. ఏకగ్రీవాలు

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top