మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న 'డ్రాగన్' సినిమా పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ ప్రాజెక్ట్‌తో పాటు తారక్ లైనప్‌లో మరికొన్ని పాన్ ఇండియా చిత్రాలు కూడా ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే అందరి దృష్టి మాత్రం ఇప్పుడు ఒకే అంశంపై నిలిచింది.. అదే దేవర 2 నిజంగా వస్తుందా..? లేదా?
దేవర 1 విడుదల సమయంలోనే దీనికి రెండో భాగం ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. దర్శకుడు కొరటాల శివ కూడా కథను రెండు భాగాలుగా ప్లాన్ చేసినట్టు పలుమార్లు వెల్లడించారు. అంతేకాదు, ఇటీవల స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపించాయి. దీంతో అభిమానుల్లో 'దేవర 2'పై ఆసక్తి మరింత పెరిగింది. అయితే తాజాగా జరిగిన కొన్ని పరిణామాలు ఈ ప్రాజెక్ట్‌పై అనుమానాలకు తావిస్తున్నాయి.

తారక్ పుట్టినరోజు సందర్భంగా 'దేవర' నిర్మాణ సంస్థ ప్రత్యేకంగా విషెస్ తెలియజేసినా, 'దేవర 2' గురించి ఒక్క చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. సాధారణంగా పెద్ద సీక్వెల్స్ విషయంలో మేకర్స్ చిన్న క్లూ అయినా ఇస్తుంటారు. కానీ ఈసారి అలాంటిదేమీ కనిపించకపోవడం అభిమానుల్లో చర్చకు దారి తీసింది.
ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే.. గతంలో హీరోయిన్ జాన్వీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టులు చేసిన 'దేవర' సోషల్ మీడియా హ్యాండిల్స్, ఈసారి తారక్ బర్త్‌డే విషయంలో మాత్రం అంతగా యాక్టివ్‌గా కనిపించలేదు. దీంతో సోషల్ మీడియాలో 'దేవర 2 హోల్డ్‌లో పడిందా?', 'లేదా పూర్తిగా ఆగిపోయిందా?' అనే సందేహాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అయితే అధికారికంగా చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఇప్పటికీ స్పష్టత మాత్రం లేదు. కానీ అభిమానులు మాత్రం ఒక విషయంపై క్లియర్‌గా ఉన్నారు.. 'దేవర' కథ ఇంకా పూర్తి కాలేదని, తారక్-కొరటాల కాంబినేషన్ మరోసారి తెరపైకి రావాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri