మేజర్ల పెళ్లిపై సుప్రీం సంచలన తీర్పు

Monday, 05 Feb, 5.49 am

ఈ మద్య యువత ఎక్కువ శాతం ప్రేమ వివాహాలవైపే మొగ్గు చూపిస్తున్నారు. అయితే ప్రేమ వివాహాలు మాత్రం పెద్దలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. తాము చిన్ననాటి నుంచి ఎంతో మురిపంగా పెంచుకున్న పిల్లలు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ..ఎవరినో అనామకులను ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల తమ కుటుంబం తలదించుకోవాల్సి వస్తుందని..అలాంటి ప్రేమ వివాహాల వల్ల తమ స్టేటస్ మంటకలిసి పోతుందని వ్యతిరేకిస్తున్నారు. తాజాగా వయసొచ్చిన ఇద్దరు వ్యక్తులు.. పెళ్లికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

మొన్నటి వరకు పెళ్లికి కులాలు, మతాలు అడ్డు అని, పెద్దల అంగీకారంతోనే పెళ్లిల్లు జరగాలంటూ చాలా కండీషన్లు ఉండేవి.