Wednesday, 27 Jan, 6.59 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
మొత్తానికి 'మాస్టర్' రిలీజ్ డేట్ వచ్చేసింది ..... ఏంటి షాక్ అయ్యారా .....??

ఇళయ దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా మాస్టర్ . మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటించిన ఈ సినిమాలో మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటించింది. అనిరుద్ రవిచందర్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాని ఎక్స్ బి ఫిలిం థియేటర్స్ బ్యానర్ ఎంతో భారీ ఖర్చుతో నిర్మించింది. ఇటీవల సంక్రాంతి పండుగ కానుక ఎన్నో భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా ఓవరాల్ గా యావరేజ్ టాక్ ను సంపాదించుకుంది.

ఇక తమిళ్ సహా పాన్ ఇండియా మూవీ గా పలు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్ లభించాయని అటు తమిళంలో ఈ సినిమా ప్రస్తుతం బాగానే కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది అని అంటున్నారు విశ్లేషకులు. సినిమాలో విజయ్, విజయ్ సేతుపతి ల అద్భుత నటన, అనిరుద్ రవిచందర్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సత్యన్ సూర్యన్ అందించిన ఫోటోగ్రఫీ భారీ నిర్మాణ విలువలు సినిమాకి కొంత వరకు బలంగా నిలిచాయని అయితే దర్శకుడు లోకేష్ కనకరాజ్ సినిమాలో కీలకమైన కథా, కథనాల విషయంలో మరింత జాగ్రత్త వహించి ఉంటే తప్పకుండా సినిమా బ్లాక్బస్టర్ సక్సెస్ కొట్టి ఉండేదని పలువురు ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.

అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా అతి త్వరలో ఓటిటి లో ప్రసారం కానుంది అంటూ కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఈ విషయమై ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితం అధికారికంగా న్యూస్ బయటికి రావడం జరిగింది. మరొక రెండు రోజుల్లో అనగా జనవరి 29న మాస్టర్ సినిమా ప్రముఖ ఓటీటీ మాధ్యమం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది అంటూ ప్రకటన రావడంతో విజయ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ న్యూస్ పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.....!!

కూతురుతో కలిసి రహనే స్టెప్పులు..వైరల్ !!

జగడ్డ: జగన్‌పై మరో బాంబు రెడీ చేస్తున్న నిమ్మగడ్డ..!?

జగడ్డ: సాయిరెడ్డి పప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడకడం లేదే..!

అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?

జగడ్డ: నువ్వా-నేనా: సర్కారుకు నిమ్మగడ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!

జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?

టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top