Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నన్ను మానసికంగా వేధిస్తున్నారు.. జయంరవి షాకింగ్ కామెంట్స్..!

నన్ను మానసికంగా వేధిస్తున్నారు.. జయంరవి షాకింగ్ కామెంట్స్..!

కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన జయం రవి ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భార్య ఆర్తితో విడాకుల ప్రకటన వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా తన వ్యక్తిగత జీవితం పైన దుష్ప్రచారాలు వినిపిస్తున్నాయని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
దీంతో జయం రవి ఈ వివాదాలు పూర్తిగా సర్దుమునిగి, విడాకుల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు తన నుంచి ఎలాంటి కొత్త సినిమాలు రావు అంటూ ప్రకటించడంతో ఈ విషయం కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జయం రవి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ గా పలు విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన పిల్లలను కనీసం చూడనివ్వడం లేదని, వాళ్ల దగ్గర ఉన్న మొబైల్స్ లాక్కుంటున్నారు. చివరికి స్కూల్ దగ్గరికి వెళ్లాలన్న బాడీగార్డ్స్ తో పంపిస్తున్నారు. అందుకే నా పిల్లలు ఈ వీడియో చూడాలి ,వాళ్ళ
తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోవాలని, మానసికంగా వేధించడానికే ఇలా పిల్లలను దూరంగా చేస్తున్నారని, సోషల్ మీడియాలో కూడా తన ప్రతిష్టను దిగజార్చడానికే ఇలాంటి ప్లాన్లు వేస్తూ, నాకు వ్యతిరేకంగా మాట్లాడడానికి డబ్బులు ఇచ్చి మరి ఒక గ్రూపుని మెయింటైన్ చేస్తున్నారు. ఈ పనులన్నీ మూడు అక్షరాల ఇడ్లీ నటి వెనుక ఉండి ఈ డ్రామా నడిపిస్తోందంటూ తెలియజేశారు.

అంతేకాకుండా సింగర్ కెనిషాను కూడా ఇక్కడి నుంచి వెళ్లగొట్టారు. నాకు విడాకులు వస్తాయా రావా? అనే విషయం పక్కన పెడితే.. నా మీద జరుగుతున్న ఈ ట్రోలింగ్ చూసి నాకే బాధేస్తోంది.ఇండస్ట్రీలోకి వచ్చి 23 ఏళ్లు అవుతోంది ఎలాంటి మచ్చ లేకుండా తాను ఇన్ని రోజులు బ్రతికాను కానీ వివాహం చేసుకున్నాకే నరకం చూసానని, వివాహమైన మొదటి రోజు నుంచే బ్లాక్మెయిల్ స్టార్ట్ చేశారని, ఇంట్లో ఉన్నప్పుడు వారి చెప్పు చేతులలో ఉండేలా తనపైన చేతబడి కూడా చేయించారంటూ ఆరోపణలు చేశారు.


సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald