Sunday, 20 Sep, 9.00 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
న్యాయమూర్తులు రాజకీయ నాయకుల్లా మారిపోతున్నారేంటి..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా ఒక్కటై జగన్ ను సమస్యల వలయంలోకి నెట్టాలని చూస్తున్నారు.. అయితే ప్రజల అండదండ ఉన్నన్నాళ్ళు జగన్ ను ఎవరు ఏమీ చేయలేరని అందరికి తెలిసిన విషయమే.. తాజాగా ప్రతిపక్షాలకు తోడు న్యాయమూర్తులు జగన్ కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది.. ఉన్నత స్థానంలో ఉంది న్యాయం చెప్పాల్సిన న్యాయమూర్తులు ఇలా అన్యాయంగా ప్రవర్తించడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.. ఇక ప్రభుత్వంపై వేస్తున్న అన్ని కేసుల్లో నూ వైసీపీ కి వ్యతిరేకంగానే తీర్పులు వస్తుండడంతో వైసీపీ లో ఆందోళన గురవుతుంది.. నిమ్మగడ్డ వంటి కీలక మైన కేసులో కూడా ప్రభుత్వంపై దుమ్మెతి పోసే ప్రయత్నం చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, రమేష్ బాబు కేసు ఇలా ప్రతి విషయంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.. దీనిపై అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకోగా పార్లమెంట్ లో ఎంపీ లు ఈ విషయంపై ఆందోళనలు చేస్తున్నారు.. దే సమయాన హైకోర్టులో పాలన చేయాల్సింది మేమా..వాళ్లా అంటూ సూటిగానే అడిషనల్ అడ్వొకేట్ జనరల్ సంధించిన ప్రశ్నలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మొత్తంగా శాసన వ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం శృతిమించిందనే వాదన బలపడుతోంది. న్యాయవాదులంతా టీడీపీ నేతల చెప్పు చేతల్లో ఉంటూ కనుసన్నల్లో పనిచేస్తున్నారని అందుకే ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు వస్తున్నాయని వైసీపీ నేతల ఆరోపణ..

ఇక భూపంపిణీల విషయంలో న్యాయవాదులు రాజకీయనాయకుల్లా ప్రవర్తించడం ఒకింత అనుమానాలను కలిగిస్తుంది. 2008లో జరిగిన దానికి భిన్నంగా 2019 లో జరగడం పై అందరు ఆలోచన చేస్తున్నారు వైఎస్సార్ హయాంలో న్యాయమూర్తులకు ఇళ్లస్థలాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినప్పుడు న్యాయమూర్తులు నైతిక విలువల పేరుతో నేరుగా ప్రభుత్వ ప్రయోజనం పొందడానికి నిరాకరిస్తే ఇప్పుడు టీడీపీ ఇస్తే తీసుకోవడం పట్ల వారికున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది.. ఇది ఇలానే కొనసాగితే రాష్ట్రంలో రాజకీయనాయకులకు, న్యాయవాదులకు పేద గా తేడా ఉండదని అంటున్నారు..

ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు.. ఇది తప్పక చేయాలి..!

మొదటి మ్యాచ్ లోనే తన కెప్టెన్సీ పవర్ చూపిన ధోనీ...

బిగ్ బాస్ సీజన్ 4 : దేత్తడి హారిక బయటకు వస్తుందా..?

ఈసారి చెన్నై, ముంబై కాదు.. టైటిల్ విజేత ఎవరో చెప్పిన సచిన్..?

బిగ్ బాస్ లో అవినాష్.. సోలో కెప్టెన్ గా కెవ్వు కార్తిక్..!

బిగ్ బాస్ 4 : గంగవ్వ అభిమానులకు శుభవార్త..?

భయ పడకండి మీకు మేమున్నాం:

అవినీతి అధికారులు మిమ్మల్ని జలగల్లాగ పీడిస్తున్నారా? మీకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరితో మొరపెట్టుకోవాలో మీకు తెలియడంలేదా? ఇండియా హెరాల్డ్ నిర్భయంగా మీ ఘోషను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళుతుంది. మీ బాధను పూర్తి వివరాలు, ఆధారాలతో సహా nofear@indiaherald.com కు నేడే పంపించండి.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top