సుకుమార్ సినిమాలను చేయడం అంత ఈజీ కాదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు చెయ్యాలి అంటే కచ్చితంగా ధైర్యం ఉండాలి ముందు. ఆయన ఎంచుకునే కథలు ఆ సినిమా చేసే విధానం అన్నీ కూడా ఒక సంచలనం. ప్రతీ ఒక్కటి కూడా ఆయనతో సినిమా చేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించే పరిస్థితి ఉంటుంది. ఇక ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తున్నాడు. పుష్ప అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో ఇప్పుడు కొన్ని కొన్ని సన్నివేశాలు సంబంధించి మార్పులు చేస్తున్నారు.
ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో బన్నీ కి సంబంధించి కొన్ని కొన్ని కీలక మార్పులను చెయ్యాలి అని భావిస్తున్నాడు సుకుమార్.
బన్నీ నుంచి స్పష్టమైన హామీ సుకుమార్ కి రావడం తో ఆయన కూడా ఇప్పుడు కథను బన్నీ కి తగిన విధంగా మార్చి కొన్ని కొన్ని సన్నివేశాలు కష్టమైనా సరే షూట్ చెయ్యాలి అని భావిస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో కొందరు కీలక నటులకు సంబంధించి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ లో టాక్.
హెరాల్డ్ సెటైర్ : ఈ రంగులే కొంప ముంచేసిందా ? ఇంకా రంగుల రాజకీయమేనా ?
హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడి, అమిత్ షా ఎల్లోమీడియాకు ఇంత చీపైపోయారా ?
అందం: గంధంతో ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ముఖం మెరిసిపోవాల్సిందే..!!
ఎడిటోరియల్ : వైసిపిలో సీనియర్లు మండిపోతున్నారు.. కారణం తెలుసా ?
సినీ రాజకీయం: రామ్ గోపాల్ వర్మ మరొక సంచలనం !
కరణం మల్లేశ్వరి బయోపిక్ లో..!
ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో పవన్ -క్రిష్ మూవీ...
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh

