పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ సాన్నిహిత్యం వల్ల జ్యోతిష్యం పై బాగా నమ్మకం పెరిగింది అని అంటారు. ప్రస్తుతం పవన్ కు అతడి జాతక రీత్యా సలహాలు ఇచ్చేది పూజలు చేయించేది త్రివిక్రమ్ కు బాగా సన్నిహితుడైన ఒక జ్యోతిష్కుడు అన్న ప్రచారం ఉంది.
ఇలాంటి పరిస్థితులలో పవన్ రీ ఎంట్రీ మూవీ 'పింక్' రీమేక్ కు అతడి జ్యోతిష్కుడు సలహాలు వల్ల దిల్ రాజ్ కు సమస్యలు ఏర్పడ్డాయి అంటూ గాసిప్పులు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటూ మే నెలలో విడుదల కావడానికి ప్రయత్నిస్తున్న ఈ మూవీ టైటిల్ విషయంలో పవన్ జ్యోతిష్కుడు తో సమస్యలు వచ్చినట్లు టాక్.
వాస్తవానికి ఈ సినిమాకు 'లాయర్ సాబ్' అన్న టైటిల్ తో పాటు 'వకీల్ సాబ్' అన్న టైటిల్ కూడ ప్రచారంలో ఉంది.
'వకీల్ సాబ్' అనేది పవన్ పేరు బలాన్ని బట్టి ఏమాత్రం బాగా లేదని ఆ టైటిల్ పెడితే కలిసిరాదని జ్యోతిష్కులు వాదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దిల్ రాజ్ కు మాత్రం 'వకీల్ సాబ్' అయితేనే బాగుంటందని పవన్ ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడట. ఇప్పటికే 'జాను' ఫెయిల్యూర్ తో షాక్ కు గురి కావడమే కాకుండా సుమారు 10 కోట్లకు పైగా నష్టపోయిన దిల్ రాజ్ 70 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న పవన్ రీ ఎంట్రీ సినిమా విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగకూడదని ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో అనేక మార్పులు చేర్పులు సూచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..
భారీ డిజాస్టర్ దర్శకుడికి క్రేజీ ఛాన్స్..!
సాంకేతిక యుగ సైనికుడి అద్భుత ఆవిష్కరణలు.. సమాజాన్ని మారుస్తున్నాయ్‌గా...!
సొంత లాభం కొంతమానుకుని సామాజిక సేవలో కేజీపీ గ్రూప్..!
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja

