Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ కళ్యాణ్ కమిటయిన సినిమాలన్ని కంప్లీటవుతాయా ..?

పవన్ కళ్యాణ్ కమిటయిన సినిమాలన్ని కంప్లీటవుతాయా ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ లో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన సూపర్ హిట్ మూవీ పింక్ కి అఫీషియల్ రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఇదే సినిమాని కోలీవుడ్ లోను అజిత్ తో నిర్మించగా అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. హిందీ, తమిళంలో ఈ సినిమా 100 కోట్ల కి పైగానే వసూళ్ళు సాధించింది.


దాంతో ఈ సినిమాని దిల్ రాజు..బోనీకపూర్ తెలుగులో పవన్ కళ్యాణ్ నిర్మించడానికి సిద్దమయ్యారు.

ఇక ఈ సినిమాతో ఎప్పటి నుంచో దిల్ రాజుకి పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించాలన్న కల నెరవేర్చుకుంటున్నాడు. ఎం.సి.ఏ ఫేం వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సిన కొన్ని కోర్ట్ సన్నివేశాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయని సమాచారం.

ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో నటించబోతున్నాడు పవన్ కళ్యాణ్. సూర్య మూవీస్ బ్యానర్ లో ఎ.ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా పీరియాడికల్ మూవీగా ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ లేకుండా కొంత టాకీ పార్ట్ కంప్లీట్ చేశాడట క్రిష్. వకీల్ సాబ్ కంప్లీటయ్యాక ఈ సినిమాలో జాయిన్ అవుతాడని అంటున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా పవన్ కళ్యాణ్ సినిమాకి కేటాయించిన డేట్స్ మొత్తం తారుమారు అయ్యాయని సమాచారం. వరసగా కమిటయిన సినిమాలని పూర్తి చేసి మళ్ళీ రాజకీయాల మీద పూర్తి దృష్ఠి సారించాలనుకున్న పవన్ కళ్యాణ్ ప్రణాళికలు ఇప్పుడు మొత్తం గందరగోళంగా మారినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కమిటయిన సినిమాలను పూర్తి చేయగలడా అన్న సందేహాలు కొందరిలో మొదలయ్యాయట.



దిల్ రాజ్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న అల్లుఅరవింద్ సలహాలు ?

మంత్రిగా బాబు కంటే మంచి మార్కులు కొట్టేసిన వైఎస్...

హెరాల్డ్ ఎడిటోరియల్ : చైనాకు ఛీత్కారాలు...దుర్బుద్ధికి ప్రపంచ దేశాల సత్కారం...

విజయం మీదే : చేసే పనిని ప్రేమిస్తే ఏ పనిలోనైనా విజయం మీ సొంతం

ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ని పునాదులతో నిలబెట్టిన వైఎస్

చైనా..1962 నాటి సీన్ రిపీట్ ?

రాజన్న కథ వెండితెర బ్లాక్ బస్టర్

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Kunchala Govind
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald