Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ కళ్యాణ్ కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..?

పవన్ కళ్యాణ్ కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..?

సినీ హీరో ,జనసేన పార్టీ అధినేత,ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇటీవల సైనస్ సమస్యతో ఇబ్బంది పడుతూ శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు తెలిసిందే.
దీని ప్రభావం కంటి మీద కూడా పడినట్లు వినిపిస్తోంది. దీంతో మరో చికిత్స కూడా అవసరమని వైద్యులు తెలియజేస్తున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ కు ఏ శస్త్ర చికిత్స జరిగింది? ఎందుకు అంత సీరియస్ అంటూ అభిమానులు కూడా తెగ ఆందోళన చెందుతున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ కు చేసిన శస్త్ర చికిత్స కు సంబంధించి వైద్యులు మాత్రం అధికారికంగా వివరాలను బయటపెట్టలేదు. ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్న నివాసానికి వెళ్లి మరి పరామర్శించారు. ఈ భేటీ అనంతరం ఇటీవల బయటకు రాకపోవడానికి గల కారణాలను పవన్
కళ్యాణ్ పూర్తి వివరాలు స్వయంగా ముఖ్యమంత్రికి వెల్లడించినట్లు వినిపిస్తోంది. 15 రోజుల క్రితం తనకు శస్త్ర చికిత్స జరిగిందని, తనకు ఎదురైన సమస్యలన్నిటినీ కూడా పవన్ కళ్యాణ్ వివరంగా చెప్పారు.

మొదట ఇది సాధారణ సైనస్ సమస్యగా ఉండేదని, కానీ అది తీవ్రత ఎక్కువ ఇన్ఫెక్షన్ గా మారిందని తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్ కంటి ప్రాంతం పైన ఎక్కువగా ప్రభావం చూపడంతో పరిస్థితి కాస్త పెద్దదైందని దీంతో వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని సూచించారని వివరించారు డిప్యూటీ సీఎం. అంతేకాకుండా ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ నిర్వహించారని, దీంతో సైనస్ లో పేరుకుపోయిన ఇన్ఫెక్షన్ ని తొలగించి శ్వాస మార్గాలను శుభ్రం చేయడానికి ఈ శస్త్ర చికిత్స చేస్తారని వెల్లడించారు. ఈ శస్త్ర చికిత్స విజయవంతం అయినప్పటికీ ఇంకా కొంతమేరకు నాసల్ బ్లీడింగ్ కొనసాగుతోందని దీంతో మరో వారం రోజుల తర్వాత తాను పూర్తిగా కోలుకుంటానని వైద్యులు చెప్పినట్లు పవన్
కళ్యాణ్ సీఎం చంద్రబాబుకు వివరించారు. సినిమా షూటింగ్లలో కొన్ని యాక్షన్స్ సన్నివేశాలలో నటిస్తున్న సమయంలో తగిలిన గాయాలు కూడా తనకు ఇప్పటికీ నొప్పిని కలిగిస్తున్నాయని గత ఐదేళ్లుగా భుజం దగ్గర మజిల్ గాయం కాగా వాటిని అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అవే సమస్యలుగా మారుతున్నాయని తెలిపారట. ఈ విషయాలన్నీ విన్న చంద్రబాబు తన ఆరోగ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కోరారు వైద్యులు సూచించిన సూచనలు తప్పక పాటించాలని సలహా ఇచ్చారు.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald