ఐలాండ్
ఐరోపాలో ఉన్న అతిపెద్ద ద్వీపం ఐలాండ్. గ్రేట్ బ్రిటన్ తర్వాత ఐరోపాలో ఉన్న అతిపెద్ద ద్వీపంగా ఐలాండ్ ను పేర్కొంటారు. ఇక్కడ జూన్ నెలలో మొదలు సూర్యాస్తమయం అనే మాటే ఉండదు. అర్ద రాత్రి కూడా సూర్యుడు కనిపిస్తాడు.
అలస్కా
అలాస్కా లోని బారో లో మే చివరి నుండి జూలై చివరి వరకు సూర్యుడు అస్తమించడు. కానీ నవంబర్ లో మాత్రం ఇక్కడ 30 రోజులు చీకటి గానే ఉంటుంది. దీనిని పోలార్ నైట్ అని కూడా పిలుస్తారు.
ఫిన్లాండ్
వేలాది సరస్సులు ద్వీపాల తో ఉన్న ఈ దేశం చాలా అందంగా ఉంటుంది. కానీ ఇక్కడ వేసవి కాలంలో 70 రోజుల పాటు సూర్యుడు అస్తమించడు. పైగా అందమైన హిమనీ నదాలు, మంచుపై స్కీయింగ్ ప్రధాన ఆకర్షణలు.