Thursday, 04 Mar, 9.11 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

రాజకీయ వార్తలు
పుర పోరు: పలమనేరులో తారా స్థాయికి చేరిన టీడీపీ, వైసీపీ విభేదాలు !

ఆంధ్ర ప్రదేశ్ లో పుర పాలక ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. మొన్న ఉదయం నుంచి మొదలైన విషయం తెలిసిందే.. నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యింది.నామినేషన్ల ఉపసంహరణ విషయంలో వైకాపా, తెదేపా నేతలు ఘర్షణకు దిగారు. చిత్తూరు జిల్లా పలమనేరు పురపాలక సంఘం కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు వైకాపా నేతలు ప్రయత్నించారు. వైకాపా నేతలను అడ్డుకునేందుకు అక్కడే ఉన్న తెదేపా నేతలు ప్రయత్నించడంతో గొడవకు దారి తీసింది. నామినేషన్ల ఉపసంహరణలో అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెదేపా నాయకులు ఆరోపించారు.

అలా మాటామాటా పెరిగి ఘర్షణ తీవ్రస్థాయికి చేరి పరస్పరం కొట్టుకొనే వరకు వెళ్లింది. మాటల యుద్ధం పెరగడంతో నేతలు అంతా ఒక్కసారిగా దాడికి ఎగబడ్డారు. తోపులాట తీవ్ర స్థాయికి చేరడంతో అక్కడే ఉన్న పోలీసులకు ఇరు వర్గాలను అదుపుచేయడం కష్టంగా మారింది. అయితే పోలీసులు తీవ్రంగా శ్రమించి ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయినా కూడా కొద్ది సేపటి తరవాత మళ్లీ గొడవకు దిగారు. దీంతో మళ్లీ పోలీసులకు తల నొప్పిగా మారింది..

నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినందున ఇతరులను పురపాలక సంఘ కార్యాలయంలోకి అనుమతించబోమని పోలీసులు హామీ ఇవ్వడంతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. అనంతరం వైకాపా, తెదేపాకు చెందిన కార్యకర్తలు, నేతలను కార్యాలయం నుంచి దూరంగా పంపించారు. నామినేషన్ల గడువు ముగిసేసరికి పలమనేరు పురపాలికలోని 26 వార్డులకు 18 వార్డుల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. చిత్తూరు జిల్లాలో మళ్లీ పంచాయితీ ఎన్నికల సీను రిపీట్ అయ్యింది. పుర పాలక ఎన్నికల్లో కూడా వైసీపీ పాగా వ్యూహాలు రచిస్తున్నారు. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయా నేతలతో భేటీ అవుతూ ఎన్నికల్లో వైసీపీ పై విజయం సాధించేందుకు అవసరమైన శక్తిని అభ్యర్థుల లో నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏం జరుగుతుందో ఈ నెల 15 తర్వాత తెలుస్తుంది..

ఏపీలో ఆ నలుగురు మంత్రులదే రాజ్యం... బాలయ్య సంచలన వ్యాఖ్యలు

వైరల్ :కేవలం 20 చెట్లతో 36 లక్షలు సంపాదన..?

అప్పులకుప్ప ఆంద్రప్రదేశ్ - ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరం

కరోనాతో గుండెజబ్బులు... కొత్త విషయం వెలుగులోకి..

పురపోరు: మనసు మార్చుకున్న తెలుగుదేశం.. ఢీ అంటే ఢీ

పుర పోరు: పశ్చిమలో ఆ ఒక్క మహిళతో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పురపోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జన్యాలు.. ఏకగ్రీవాలు

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top