Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాఘవ లారెన్స్ బర్త్ డే గిఫ్ట్ 'రుద్రన్'

రాఘవ లారెన్స్ బర్త్ డే గిఫ్ట్ 'రుద్రన్'

 రాఘవ లారెన్స్ బర్త్ డే గిఫ్ట్ 'రుద్రన్'రాఘవ లారెన్స్ కు తమిళ్, తెలుగు చిత్రపరిశ్రమలో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. డ్యాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టి అన్ని రంగాల్లోనూ రాణించాడు. నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్ గా తన నైపుణ్యాన్ని ప్రదర్శించి ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించారు. దీంతో నిర్మాతలు మెచ్చిన దర్శకునిగా రాఘవ పేరు తెచ్చుకున్నారు.
అక్టోబరు 29 రాఘవ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కొత్త సినిమా 'రుద్రన్' పోస్టర్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందించనున్నారు. 2021 లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే రాఘవ లారెన్స్ బాలీవుడ్ చిత్రం 'లక్ష్మీ బాంబ్' చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఇది తెలుగు 'కాంచన' కు రిమేక్. డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ వేదికపై త్వరలో ఇది విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్ విడుదలయింది. దీనికి అభిమానుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. అక్షయ్ కుమార్, కియార అడ్వాణీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా కోసం లారెన్స్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తెలుగులో ఈ చిత్రం భారీ వసూళ్లు చేసింది. హర్రర్ సినిమాలతో భయపెట్టడం మాత్రమే కాకుండా ఎదో ఒక సందేశాన్ని తన చిత్రం ద్వారా చెప్పడం లారెన్స్ ప్రత్యేకత.

మరోవైపు లక్ష్మి బాంబ్ చిత్రం వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఈ చిత్రాన్ని నిషేధించాలంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ లు వెలుస్తున్నాయి. లవ్ జిహాద్ ని ప్రేరేపించేదిగా ఈ చిత్రం ఉందంటూ కొన్ని వర్గాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. నవంబర్ 9 న ఈ చిత్జ్రం విడుదల కానుంది.

ఉల్లి ధర పై కేంద్రం కీలక నిర్ణయం..!

దేశంలో కొనసాగుతున్న రహస్య ఎన్ఐఏ సోదాలు..!

అక్టోబర్ 30వ తేదీకి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

సంతాన సమస్యలు తొలగిపోవాలంటే... వీటిని దానం చేయండి...?

నాగార్జున, బాలకృష్ణ లా చిరు ధైర్యం చేయలేకపోతున్నారేంటి..?

ఇంటి చిట్కా: ఎలాంటి ఆరోగ్య సమస్య దరిచేరదు..!

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAVI TEJA
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald