Thursday, 19 Sep, 3.02 pm ఎ పి హెరాల్డ్

ముఖ్యాంశాలు
రాహుల్ హిమజ రొమాన్స్.. తట్టుకోలేకపోతున్న పునర్నవి..!

బిగ్ బాస్ సీజన్ 3 తెలుగులో బుధవారం ఎపిసోడ్ అంతా సరదాగా జరిగింది. బిగ్ బాస్ ఇచ్చిన రెగ్జోనా లవ్ కపుల్ టాస్క్ లో రాహుల్, హిమజ విన్నర్ గా నిలిచారు. అయితే వారిద్దరి కోసం రెగ్జోనా టీ షర్ట్స్ తో పాటుగా ఇద్దరికి ఓ డ్యూయెట్ కు స్టెప్పులేయమని సాంగ్ వదిలారు. ఆ సాంగ్ లో హిమజ ఇన్వాల్వ్ అయ్యి రాహుల్ మీద రొమాంటిక్ గా ప్రేమ ఒళకపోసింది.

ఇదిలాఉంటే ఈ టాస్క్ మొదట్లో రాహుల్ తో టాస్క్ చేసేందుకు పునర్నవి ఎప్పటిలానే బాగా ఓవరాక్షన్ చేసింది. అందుకే రాహుల్ సైలెంట్ గా ఉండిపోయాడు. చివరకు మహేష్ తో పునర్నవి లవ్ స్కిట్ చేసింది. అయితే రాహుల్, హిమజల క్యూట్ లవ్ స్కిట్ కు జడ్జులుగా ఉన్న బాబా భాస్కర్, వితికలు వారిని విన్నర్స్ గా ప్రకటించారు.

అయితే హిమజతో రాహుల్ డ్యూయెట్ చేస్తున్న టైంలో పునర్నవి పైకి నవ్వుతున్నట్టు కనిపించినా లోపల మాత్రం ఇబ్బంది పడిందని మాత్రం చెప్పొచ్చు. రాహుల్ తన మీద చూపించే అభిమానాన్ని తలకు ఎక్కించుకుని అతన్ని ఏరా పోరా అంటూ ఎక్కువ చేసిన మాట్లాడుతుంది పునర్నవి. అందుకే రాహుల్ ఈ టాస్క్ లో ఆమెను వదిలేసి హిమజతో చేశాడు.

చివరకు రాహుల్, హిమజల లవ్ స్కిట్ నచ్చడంతో వారే రెగ్జోజా డ్యుయెట్ సాంగ్ కు సెలెక్ట్ అయ్యారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ ఉంటుందని తెలుస్తుంది. ఈసారి కెప్టెన్ గా హిమజ, రాహుల్, రవిలు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఈ ముగ్గురు ఇదవరకు కెప్టెన్ గా గెలిచిన వారు కాదు. మరి ఈసారి వీళ్లలో ఎవరు కెప్టెన్ గా అవుతారో చూడాలి. శ్రీముఖి కూడా కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనే అవకాశం ఉంది.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top