Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రజనీకాంత్, భారతీరాజా మధ్య వివాదం రావడానికి కారణం..?

రజనీకాంత్, భారతీరాజా మధ్య వివాదం రావడానికి కారణం..?

కోలీవుడ్లో దర్శకుడుగా పేరు సంపాదించిన భారతీరాజా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. గడిచిన కొన్ని గంటల క్రితం ఈయన మరణంతో కోలీవుడ్ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ బుధవారం ఉదయం చెన్నైలో తన సొంత నివాసంలో తుది శ్వాస విడిచారు. దీంతో పలువురు సినీ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు కూడా ఆయనకు నివాళులు అర్పించారు. అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు సెలబ్రిటీస్.

ఇందులో భాగంగా సూపర్ స్టార్రజినీకాంత్, భారతిరాజా మధ్య ఉన్న వివాదం గురించి ఇప్పుడు చర్చనియంశంగా మారింది. భారతీరాజా దర్శకత్వం వహించిన మొట్టమొదటి చిత్రం 16వయదినిలే (పదహారేళ్ళ వయసు) చిత్రంలో రజనీకాంత్ ప్రధాన పాత్ర లో కనిపిస్తారు.ఈ
సినిమా 1977లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పదేళ్లు గ్యాప్ తీసుకొని మరి కోడిపరాకుత్తు చిత్రాన్ని 1988లో ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చారు అలా వీరి కలయికలో రెండు సినిమాలు వచ్చినప్పటికీ వీరిద్దరి మధ్య దాదాపుగా ఐదు దశాబ్దాల నుంచి విభేదాలు ఉన్నాయి.

ఎన్నోసార్లు డైరెక్టర్భారతీరాజా, రజనీకాంత్ పైన విమర్శలు చేశారు. ముఖ్యంగా రజనీకాంత్ తమిళనాడు వ్యక్తి కాదని కర్ణాటక వ్యక్తి అంటూ చాలాసార్లు ఆరోపణలు చేశారు. 2002 లో జరిగిన కావేరి జల వివాదంలో అప్పటి తమిళ నటులంతా కర్ణాటకకు వ్యతిరేకంగా ఒక దీక్షను చేపట్టారు. అది కూడా
భారతీరాజా న్యాయకత్వంలోనే వ్యవహరించారు. శాంతియుతంగా చేపట్టిన ఈ నిరసనలు చివరికి ఘర్షణకు దారితీసాయి. దీంతో పోలీసులపై కొంతమంది దాడి చేయగా ఈ దాడిని రజనీకాంత్ ఖండించారు. అంతేకాకుండా అప్పట్లో తమిళ నటులు చేపట్టిన ఈ దీక్షకు కూడా రజనీకాంత్ మద్దతు ప్రకటించకపోవడంతో భారతీ రాజా రజినీకాంత్ ను తమిళ ద్రోహి అంటూ బహిరంగంగా ఆరోపించారు.

అలాగే రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వినిపిస్తున్న సందర్భంలో కూడా భారతీరాజా చాలానే విమర్శలు చేశారు. కానీ డైరెక్టర్ భారతీరాజాని మాత్రం రజనీకాంత్ ఎప్పుడూ కూడా ఒక విమర్శ కూడా చేయలేదట. అయితే ఒకానొక సందర్భంలో భారతీరాజా కూడా తన మాటలతో రజినీకాంత్ ని ఇబ్బంది పెట్టానంటు ఇంటర్వ్యూలో తెలియజేశారు.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald