Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'రంగం' విలన్ తో జతకట్టబోతున్న నయనతార..

'రంగం' విలన్ తో జతకట్టబోతున్న నయనతార..

తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోతుంది నయనతార. దక్షిణాదిన ఎక్కువ రెమ్యూనరేషన్ దీసుకుంటున్న మూడు కోట్లకు పైగానే హీరోయిన్ నయన తార కావడం విశేషం. నయనతార కెరీర్ పరంగా ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె తమిళ దర్శకుడు విఘ్నేష్ ప్రేమలో మునిగిపోయింది. తాజాగా నయనతార తమిళ్ లో కో.. తెలుగు లో ఇదే మూవీని రంగం గా డబ్ చేశారు. ఈ మూవీలో విలన్ గా నటించిన అజ్మల్ అమీర్ హీరోగా ఓ మూవీలో నటిస్తున్నాడు. ఆ మద్య యాత్ర మూవీలో జగన్ పాత్రలో కనిపించాడు అజ్మల్.



నయనతారతో గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న విగ్నేష్ శివన్ ఈ సినిమా నిర్మిచమోతున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో విగ్నేష్ శివన్ ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించారు.

కాగా, ఈ మూవీ ప్రారంభించి చెన్నైపరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు. ఈ మూవీ నయనతార హీరోయిన్‌గా నటించనుంది. `అవన్‌` మూవీని తెరకెక్కించిన మిలింద్ రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీ బ్లైండ్ అనే కొరియన్ మూవీ ఆధారంగా రూపొందించబోతున్నరు. ఈ మూవీ ఓ విభిన్నమైన కథా రూపంలో ఉండబోతుందట.. ఇందులో నయనతార పూర్తి అంధురాలిగా కనిపించబోతుందట.

అయితే అజ్మల్ అమీర్ పాత్ర కూడా చాలా కొత్తగా వుంటుందని, నటనకు ఆస్కారమున్న పాత్రలో అజ్మల్ కనిపిస్తారని తమిళ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా ఉన్న పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. అందుకే నయనతార ఇలాంటి పాత్రలో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఈ మద్యే అజ్మల్ పుట్టిన రోజుని సెట్‌లోనే యూనిట్ సభ్యుల మధ్య జరిపారు. ఈ సందర్భంగా నయనతార, విగ్నేష్ శివన్ ఈ బర్త్‌డే పార్టీలో పాల్గొన్నారు. అజ్మల్ కి ఈ మూవీతో మంచి పేరు వస్తుందేమో చూడాలి.



టీటీడీ మరో సంచలన నిర్ణయం... తిరుమల ఆలయం మూసివేత...?

మీడియా మంటలు: ఏపీ మీడియాకూ సోకిన కరోనా..? ఎవరి గోల వారిదే కదా..?

బిగ్ బ్రేకింగ్‌: రేపే నిర్భయ దోషులకు ఉరి... దోషి వినయ్ తల్లి చివరి కోరిక ఇదే...!

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - siri Madhukar
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald