Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రెండో టెస్టుకు అతనొస్తున్నాడు.. ఎవరిని తీసేయాలో అర్ధం కావడం లేదట..

రెండో టెస్టుకు అతనొస్తున్నాడు.. ఎవరిని తీసేయాలో అర్ధం కావడం లేదట..

స్వదేశం లో భారత్ తో జరిగిన వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్.. టెస్టు సిరీస్ ను కూడా వైట్ వాష్ చేయాలని ఊవిళ్లూరుతుంది. అందులో భాగంగా మొదటి టెస్టు ను మూడున్నర రోజుల్లోనే ముగించి విజయాన్ని అందుకున్న కివీస్ .. ఈనెల 29నుండి ప్రారంభం కానున్న రెండో టెస్టును కూడా అదే ఆటతీరుతో గెలుచి సిరీస్ ను కైవసం చేసుకువాలని చూస్తుంది. ఇక ఈటెస్టు కు ముందు న్యూజిలాండ్ మరింత బలంగా కనిపిస్తుంది. ఎందుకంటే నెంబర్ 2 టెస్టు ర్యాంక్ బౌలర్ వాగ్నెర్ జట్టుతో కలువనున్నాడు.


మొదటి టెస్టు కు ముందు తండ్రి కావడం తో కుటుంబంతో గడపడానికి ఆ టెస్టుకు దూరమైన వాగ్నెర్ రెండో టెస్టు కు అందుబాటులో ఉండనున్నాడు అయితే వాగ్నెర్ రాక తో మేనేజ్ మెంట్ కు ఎవరిని తీసేయాలో అర్ధం కావడం లేదట మొదటి టెస్టులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు...

సౌథీ ,బౌల్ట్ , జమైసన్ రాణించారు దాంతో వీరిలో ఎవరిని పక్కకు పెట్టాలో తెలియడం లేదట అయితే స్పిన్నర్ అజాజ్ పటేల్ ను తీసేసి ఆస్థానం లో వాగ్నెర్ ను తీసుకోవచ్చు అలా చేస్తే స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా పోతాడు. మరి వాగ్నెర్ కోసం ఎవరిని బలి చేస్తారో చూడాలి.

ఇక బ్యాటింగ్ , బౌలింగ్ విభాగాల్లో విఫలమై మొదటి టెస్టులో చిత్తుగా ఓడిన టీమిండియా రెండో టెస్టునైనా గెలుచుకొని పరువు నిలుపుకోవాలని భావిస్తుంది. అందుకోసం రెండో టెస్టు లో మార్పులు చేయనుంది. పృథ్వీ షా స్థానం లో శుభ్మాన్ గిల్ ను అశ్విన్ స్థానం లో జడేజా ను అలాగే బుమ్రా స్థానం లో ఉమేష్ యాదవ్ ను తీసుకోవాలని కోహ్లీ భావిస్తున్నాడు.



బాబుకు కలిసొచ్చిన వెస్ట్...అక్కడ తమ్ముళ్ళు పికప్ అయ్యారట!

నీటి విషయంలో ఆగ్రహంగా జగన్..? కృష్ణ బోర్డు తో తాడోపేడో తేలనుందా..?

మహేష్ బాబు గురించి ఆ ప్రముఖ నటుడు మరియు రచయిత చేసిన వ్యాఖ్యలు చూడండి... !!!

మోడీ కి అక్కడ అదిరిపోయే రెస్పాన్స్....జిన్ పింగ్ కుళ్ళు...?

అతని సినిమాలకు కంటెంటే హీరో.. కొత్త హీరోయిన్లే స్టార్స్..!

చంద్రబాబు, కిరణ్ కుమార్ లు కలిసి జగన్ ఎదో చేస్తారట..?

కరోనా దెబ్బకు వేలల్లో సినిమా హాళ్ళు మూత ?

భయ పడకండి మీకు మేమున్నాం:

అవినీతి అధికారులు మిమ్మల్ని జలగల్లాగ పీడిస్తున్నారా? మీకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరితో మొరపెట్టుకోవాలో మీకు తెలియడంలేదా? ఇండియా హెరాల్డ్ నిర్భయంగా మీ ఘోషను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళుతుంది. మీ బాధను పూర్తి వివరాలు, ఆధారాలతో సహా nofear@indiaherald.com కు నేడే పంపించండి.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Kancherla Mahender Reddy
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald