Dailyhunt
"రేయ్ ముండమోపినాకొడకా".. రణబలి నుండి సెన్సేషనల్ వీడియో లీక్..విజయ్ దేవరకొండ చించి పడేశాడు..!

"రేయ్ ముండమోపినాకొడకా".. రణబలి నుండి సెన్సేషనల్ వీడియో లీక్..విజయ్ దేవరకొండ చించి పడేశాడు..!

రౌడీ హీరోవిజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'రణబలి'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
టీ-సిరీస్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వ్యక్తిగత జీవితంపై వచ్చిన వార్తలతో పాటు, ఈ సినిమాలో వారు పోషిస్తున్న పాత్రలపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. 'రణబలి'లో విజయ్ పోషిస్తున్న పాత్ర, అలాగే జయమ్మగా రష్మిక కనిపించబోతున్న తీరు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో లీక్ కావడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ వీడియోలో విజయ్ దేవరకొండ గుర్రంపై దూసుకొస్తూ, పవర్‌ఫుల్ డైలాగ్ చెబుతున్న సీన్ కనిపిస్తోంది. ఆయన చెప్పిన డైలాగ్‌లోని ఉత్సాహం, ఆగ్రహం, బాడీ లాంగ్వేజ్ కలిపి ఆ సన్నివేశానికి భారీ ఎలివేషన్ తీసుకొచ్చాయి. దీనిని ఇప్పుడు జనాలు హైలెట్ చేస్తున్నారు. 'రేయ్ ముండమోపినాకొడకా..ఏడున్నావ్ రా.. మీ ఇళ్లల్లోకి వచ్చిన.. రా చంపుదువు కానీ' అం టూ విజయ్ గుర్రం పై వస్తున్న వీడియో ఒకటి నెట్టిం ట వైరల్ అవుతుంది.

ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, అభిమానులు విపరీతంగా స్పందిస్తున్నారు. 'ఈసారి విజయ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడు', 'డైలాగ్ డెలివరీ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది', 'రణబలి బ్లాక్‌బస్టర్ కావడం ఖాయం' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి, ఈ లీక్ వీడియోతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. మొత్తానికి ఈసారి రణబలి తో విజయ్ ఖచ్చితంగా హిట్ కొట్టేస్తాదూ అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

" style="height: 428px;">



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald