Friday, 18 Oct, 10.57 pm ఎ పి హెరాల్డ్

ముఖ్యాంశాలు
రూ. 5 లక్షలకు భర్తను అమ్మేసిన భార్య..!

ఓ భార్య భర్తను 5 లక్షల రూపాయలకు అమ్మేసి జగపతి బాబు శుభలగ్నం సినిమాను గుర్తు చేసింది ఆ భార్య. అదేంటి.. శుభలగ్నం సినిమా ఏంటి అని అనుకుంటున్నారా ? అదేనండి ఆ సినిమాలో జగపతి బాబు భార్య డబ్బు కోసం తన భర్తనే అమేస్తుంది కదా అలానే.. అయితే అక్కడ జగపతి బాబు తప్పులేదు. ఇక్కడ ఉన్న భర్తది తప్పు ఉంది.

ఇంకా విషయానికి వస్తే .. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఓ మహిళ తన భర్తతో కలిసి నివసిస్తుంది. అయితే అదే ఉరికి చెందిన మరో మహిళా తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విష్యం తెలుసుకున్న భార్య ఎన్నో సార్లు నిలదీసింది, వద్దని వరించింది. అయినా ఆమె భర్త వినలేదు.

దీంతో గ్రామస్థుల ముందు పంచాయితీ పెట్టింది. దీంతో భర్త మొదట లొంగినట్టు నటించిన చివరికి ప్రియురాలి దగ్గరకు వెళ్లడం ప్రారంభించాడు. దీంతో ఆ భార్యకు పట్టలేనంత కోపం వచ్చింది. దీంతో తన భర్త, అతని ప్రియురాలు కలిసి ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

అయితే ఆమె పంచాయితీ పెట్టగా .. ప్రియుడిని వదులుకునేందుకు ప్రియురాలు అంగీకరించలేదు. 5 లక్షల రూపాయిలు ఆమె భర్త అప్పుగా తీసుకున్నాడని, అది చెల్లించకపోవడం వల్లే అతను ఆమె దగ్గర ఉంటున్నాడని తేల్చి చెప్పింది ప్రియురాలు. దీంతో భార్య స్పందిస్తూ జల్సాల కోసం కుటుంబ పరువు తీసే భర్త వద్దని.. తాను బతికేందుకు 5 లక్షల రూపాయిలు భరణంగా ఇవ్వాలని ఆమె కోరింది. దీంతో ఆ ప్రియురాలు ఆ ప్రియుడి భార్యకు 5 లక్షల రూపాయిలు భరణంగా ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top