బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయింది. ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ మరియు ట్రైలర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడంతో పాటు సినిమాపై మంచి అంచనాలు కూడా క్రియేట్ చేయడం జరిగింది. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వేదిక, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్, భూమిక, జయసుధ, సప్తగిరి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిన్న రాత్రి విశాఖపట్నంలో ఫ్యాన్స్ మరియు సినీ ప్రముఖుల సమక్షంలో ఎంతో వేడుకగా జరిగింది.
ఈ వేడుకలో పలువురు ప్రముఖులు బాలయ్యపై పొగడ్తలు కురిపించారు.
బాలయ్య సినిమా సంక్రాంతికి వస్తుందంటే మేం వెనక్కో. ముందుకో పోతాం, మరియు జాగ్రత్త పడతాం అని వ్యాఖ్యానించారు. అయితే బాలయ్య బాబు ఓ రూలర్ అని రాజశేఖర్ ఆ విధంగా అనడం పై ప్రస్తుతం పలు సినీ వర్గాల్లో ఒకింత చర్చ జరుగుతోంది. అదేమిటంటే, బాలయ్యని రాజశేఖర్ పొగిడే సమయంలో వియ్యంకుడు చంద్రబాబుని ఉద్దేశించి సరదాగా అలా అన్నాడా, లేదా రాజశేఖర్ వైసీపీలో ఉండడంతో కొంత సెటైరికల్‌గా అన్నాడా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే రాజశేఖర్ సరదాగానే బాలయ్య గారిని పొగుడుతూ చంద్రబాబు గురించి మాట్లాడారని, ఇందులో పెద్దగా విమర్శలు వెతుక్కోవలసిన అవసరం లేదని పలువురు సినీ విశ్లేషకులు దీని పై అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు......!!

