Saturday, 25 Sep, 7.00 pm ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
సాహసికుల కోసం 4 అత్యంత్య రహస్య ప్రదేశాలు

ప్రపంచ వ్యాప్తంగా అనేక రహస్య ప్రదేశాలు ఉన్నాయి. వీటి గురించి అనేక కథలు కూడా ఉన్నాయి. మీరు రహస్య ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడితే మీరు ఈ ప్రదేశాలను అన్వేషించవచ్చు. కొడిన్హి - కవలల గ్రామం, భారతదేశం
కోడిన్హి కేరళ లోని ఒక చిన్న గ్రామం, ఇది కాలికట్ నుండి 35 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ అందమైన దక్షిణ భారత గ్రామంలో సుమారు 2000 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ దాదాపు ప్రతి కుటుంబానికి కవలలు ఉన్నారు. 1949 నుండి ఈ గ్రామం భారీ సంఖ్యలో కవలలకు ప్రసిద్ధి చెందింది. అప్పటి నుండి రోజులు గడిచే కొద్దీ ఈ సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇటీవల రికార్డుల ప్రకారం ఈ గ్రామంలో 200 కవలలు ఉన్నారు. దీనిని ఇప్పటి వరకూ ఏ డాక్టర్ లేదా శాస్త్రవేత్త దీనిని పరిష్కరించలేరు.

కామాఖ్య దేవి దేవాలయం, భారతదేశం
కామాఖ్య దేవి ఈశాన్య భారతదేశంలోని అసోం రాష్ట్రంలో ఉన్న ఒక అందమైన కొండ ఆలయం. ఇది భారతదేశంలోని శక్తి పీఠాలలో ఒకటి (సతీదేవి శరీర భాగాలు భూమిపై పడిన ప్రదేశం). ఇక్కడ కాళి దేవత పూజించబడుతుంది. ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట నెలలో మూడు రోజులు ఆలయంలో చాలా రహస్యమైన సంఘటనలు జరుగుతుంది. అమ్మవారి ఋతు చక్రం జరుగుతుందని, దేవాలయం సమీపంలో ప్రవహించే బ్రహ్మపుత్ర నది నీరు ఆమె రక్తంతో ఎర్రగా మారుతుందని నమ్ముతారు.

హైగేట్ స్మశానం, ఇంగ్లాండ్
లండన్ హైగేట్ స్మశానం ఖచ్చితంగా డేర్ డెవిల్స్ కోసం ఒక ప్రదేశం. తోట మధ్యలో శతాబ్దాల నాటి దేవదూతలు, నవ్వుతున్న గార్గోయిల్‌లు, అంతులేని సమాధి రాళ్ల వరుసలు ఏ ధైర్యవంతుడిని అయినా భయ పెట్టడానికి సరిపోతాయి. రక్తం పీల్చే పిశాచాలు సూర్యాస్తమయం తర్వాత ఇక్కడ దాగి ఉంటాయని నమ్ముతారు. కానీ లోపలికి వెళ్ళడానికి ఎవరూ ధైర్యం చేయలేకపోయారు.

గ్రేట్ బ్లూ హోల్, బెలిజ్
నీటి అడుగున ఈ ప్రదేశం చాలా కాలంగా డైవర్స్ అన్వేషకులను ఆకర్షిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద సింక్ హోల్ ఇది. 1000 అడుగుల (304 మీ), 400 అడుగుల (122 మీ) లోతు. ఇది భూమిపై అత్యంత రహస్యమైన, ఇంకా కనిపెట్టబడని నీటి అడుగున ప్రదేశాలలో ఒకటి.

తెలుగు అకాడమీ: అంతా సంచలనమే...?

ముంబై ట్రిప్ వేస్తున్నారా ? చూడాల్సిన బెస్ట్ ప్లేసెస్ ఇవే !

కృష్ణా జిల్లా పాలిటిక్స్‌కు వంగవీటి గుడ్ బై.. సేఫ్ ప్లేస్ దొరికేసిందా ?

చై - సామ్ : ఒంటరి అమ్మకు ఒంటరి కొడుకు ఎలా?

సినీ చరిత్రలోనే ఆ రికార్డు నాకే సొంతం అన్న మోహన్ బాబు..?

స్కిప్పింగ్ చేస్తే పిల్లలు ఎత్తు పెరుగుతారా..?

ఆమె గెలిచింది కదా.. మోడీ రాజీనామా చేస్తారా : కవిత

బిగ్ బాస్ 5 : ఈసారి రహస్యంగా నామినేషన్లు?

30 ఏళ్ల తర్వాత.. చిరంజీవి సినిమాలో ఆ హీరో?

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top