Monday, 23 Sep, 11.57 am ఎ పి హెరాల్డ్

ముఖ్యాంశాలు
సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి స్పీచ్ అదరహో... ఏమన్నాడంటే..?

మెగాస్టార్ కేరియర్ లోనే మొట్టమొదటి పిరియాడికల్ సినిమాగా...భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జక్కన్న రాజమౌళి మాటలు అందరిని ఆకర్షించాయి. బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన మొదటి తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర తెరకెక్కించడం గొప్ప విషయమన్నారు రాజమౌళి. ఇలాంటి సినిమాని నిర్మించి తన తండ్రి చిరంజీవికి బహుమతిగా ఇస్తున్నాడన్నారు . కేవలం చిరంజీవి గారికే కాదు తెలుగు ప్రజలందరికీ ఈ చిత్రం ఒక బహుమతి గా మారుతుందన్నారు .

అయితే ఈ సినిమాలో బాహుబలి కి మించి విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నారు రాజమౌళి. బాహుబలిలో 2300 విజువల్ ఎఫెక్ట్స్ వాడితే ... సైరా లో 3800 విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలిపారు. ఈ సినిమాని డైరెక్టర్ చాలా బాగా తెరకెక్కించారని... ఎక్కడ కూడా ఎమోషన్స్ ని మర్చిపోకుండా విజువల్ ఎఫెక్ట్స్ ఎమోషన్స్ ని బాగా బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కించారని డైరెక్టర్ పై ప్రశంసలు కురిపించారు రాజమౌళి .

అయితే తాను చిరంజీవి గారితో ఒక సినిమా కూడా చేయలేకపోయానని ... కానీ మగధీర లో ఒక సీన్ మాత్రం చేశానన్నారు. కాగా మగధీర తర్వాత చిరంజీవి గారు తన కెరీర్ లో ఇలాంటి సినిమా ఒకటి కూడా చేయలేదని బాధపడ్డారని. కానీ అంతకు మించిన సినిమాని రామ్ చరణ్ మెగాస్టార్ కి బహుమతిగా ఇచ్చారని రాజమౌళి తెలిపారు.

చివరగా తన ప్రసంగాన్ని ముగిస్తూ చిరంజీవి పవన్ కళ్యాణ్ వెనుక ఉంటే మాట్లాడటం చాలా కష్టం అని ఛలోక్తులు విసిరారు జక్కన . సైరా నరసింహారెడ్డి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సైరా నరసింహారెడ్డి హాట్ టాపిక్ గా మారింది. కాగా ఈ చిత్రంలో చిరంజీవితో పాటు భారీ తారాగణం కూడా నటించిన విషయం తెలిసిందే . అయితే అక్టోబర్ 2 న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామి సృష్టిస్తుంది చూడాలి మరి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top