Dailyhunt
సల్మాన్ ఖాన్ కి విలన్ గా మరో స్టార్ హీరో..?

సల్మాన్ ఖాన్ కి విలన్ గా మరో స్టార్ హీరో..?

టాలీవుడ్ డైరెక్టర్వంశీ పైడిపల్లి తన కెరియర్లో ఎన్నో విభిన్నమైన చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. చివరిగా 2023లో వారిసు వంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కలిసి తన తదుపరి సినిమా చేయబోతున్నారు.
సినిమా భారీగా ఉండబోతుందని బాలీవుడ్లో వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పైనే ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 2026 ఏప్రిల్ నుంచే ప్రారంభం కానుంది. వంశీ పైడిపల్లి తన మార్క్ ఎలివేషన్స్ తో సల్మాన్ ఖాన్ తో యాక్షన్ సినిమాగా తెరకెక్కించనున్నారు. పాన్ ఇండియా ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమాని తీసుకురాబోతున్నారు.

తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ గా మారింది. గతంలో స్టార్ హీరోగా పేరు సంపాదించిన అరవింద్ స్వామి హీరోగా అవకాశాలు తగ్గడంతో ధ్రువ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అప్పటి నుంచి పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటున్న అరవింద్ స్వామి ఇప్పుడు తాజాగా సల్మాన్ ఖాన్ సినిమాలో విలన్ పాత్రలో నటించే అవకాశాలు ఉన్నట్లు బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.

సల్మాన్ ఖాన్, అరవింద్ స్వామిల మధ్య వచ్చే సీన్స్ కూడా హైలెట్ గా ఉంటాయని, అలాగే ఇందులో మరో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ స్టార్ అయిన అనిల్ కపూర్ ని కూడా చిత్ర బృందం సంప్రదించినట్లు వినిపిస్తున్నాయి. హీరోయిన్గా నయనతార కూడా ఇందులో నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు సమాచారం. మరి అటు అరవింద్ స్వామి, అనిల్ కపూర్ వంటి హీరోల పైన వినిపిస్తున్న వార్తలపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald